Hyderabad: బుర్ఖాలో బైక్‌పై ప్రమాదకర స్టంట్స్.. చివరకు పోలీసులకు చిక్కి..

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం కోసం చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు.

By Srikanth Gundamalla  Published on  20 Aug 2024 9:45 PM IST
man, bike stunt,   burkha, hyderabad ,two arrested ,

Hyderabad: బుర్ఖాలో బైక్‌పై ప్రమాదకర స్టంట్స్.. చివరకు పోలీసులకు చిక్కి..  

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం కోసం చాలా మంది పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. లైక్స్‌ షేర్స్‌.. ద్వారా గుర్తింపు వస్తుందని కొందరు మంచి రీల్స్ చేస్తుంటే.. కొందరు మాత్రం ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు స్వతహాగా వారే ప్రమాదాల్లో ఇరుక్కుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అయితే.. కొందరు ఆకతాయిలు మాత్రం ఎదుటి వారిని కూడా డేంజర్‌లో పడేస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ యువకుడు బుర్ఖా ధరించి బైక్‌ స్టంట్స్ చేశాడు. అతను మరో వ్యక్తిని వెనకాల కూర్చోబెట్టుకుని దీన్ని చేశాడు. రద్దీ ప్రాంతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ యువకులు పోలీసులు బుద్ధి చెప్పారు.

హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అలాంటి ఏరియాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు హల్‌చల్ చేశారు. బైక్ నడుపుతున్న వ్యక్తి బుర్ఖా ధరించగా అతని స్నేహితుడు వెనకాల కూర్చున్నాడు. వారిద్దరూ కలిసి బైక్‌పై స్టంట్స్ చేస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేశారు. వారు చేసిన హడావిడి మెుత్తం మరో ద్విచక్రవాహనంపై ఉన్న అతని స్నేహితులు వీడియో తీశారు. అయితే ఓ ముస్లిం యువతి ఇంత బాగా ద్విచక్రవాహనం నడుపుతోందా అనేలా ప్రజల్ని ఆశ్చర్యపరచాలనే ఉద్దేశంతో వీడియో తీసినట్లు తెలుస్తోంది. దీనిపై ముస్లిం యువతులు ఎదురైనప్పుడు వారు వెకిలిగా నవ్వుతూ కేకలు పెట్టారు. అలాగే ఓ యువకుడి వచ్చి ముస్లిం యువతి వేషధారణలో ఉన్న వ్యక్తికి మద్దు పెట్టాడు. వారితో చేరిన మరికొంతమంది యువకులు రోడ్లపై వీరంగం సృష్టించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.

అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో చూసి ముస్లిం ప్రజలు, మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మతానికి చెందిన యువతులను అపహాస్యం చేసేలా వీడియో తీశారంటూ మండిపడ్డారు. ఆ తర్వాత సదురు యువకులపై ఐఎస్ సదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను అవమానించి, మనోభావాలు దెబ్బతీసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా బైకర్‌ నడిపిన వ్యక్తితో పాటు అతని స్నేహితుడిని అరెస్టు చేశారు.


Next Story