మెట్రో ట్రాక్‌పై పడిపోయిన చిన్నారి.. సెక్యూరిటీ చేసిన పనితో..

చిన్నారులను ఎప్పుడైనా సరే బయటకు తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 11:21 AM GMT
maharashtra, pune, metro, child,   track,

మెట్రో ట్రాక్‌పై పడిపోయిన చిన్నారి.. సెక్యూరిటీ చేసిన పనితో..

చిన్నారులను ఎప్పుడైనా సరే బయటకు తీసుకెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారు రోడ్లపై కానీ.. రద్దీ ప్రదేశాలు.. లేదా ఇతర ఏ ప్రాంతాల్లో అయినా సరే నచ్చినది ఏదైనా కనిపిస్తే చాలా అటువైపుగా పరుగెత్తి చూస్తుంటారు. కొన్నిసార్లు ఇలా చేయడం ద్వారా వారు ప్రమాదాల్లో పడుతుంటారు. ముఖ్యంగా ప్రయాణాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. తాజాగా మహారాష్ట్రలోని పుణెలో కూడా చిన్నారి మెట్రో ట్రాక్‌పైకి దూకేసింది. ఆ తర్వాత చిన్నారి తల్లి కూడా కాపాడేందుకు ట్రాక్‌పైకి దూకేసింది.

మహారాష్ట్రలోని పుణెలో ఓ మెట్రోస్టేషన్‌లో ట్రైన్‌ ఎక్కేందుకు చిన్నారిని తీసుకుని తల్లి వచ్చింది. టికెట్‌ కొన్న తర్వాత ట్రైన్‌ ఎక్కేందుకు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. అయితే.. చిన్నారి పక్కనే నడుస్తుంది కదా అని పట్టుకోలేదు. అయితే.. ఆ చిన్నారి ఆడుతూ పాడుతూ వెనకాలే రాసాగింది. ఉన్నట్లుండి ఏమనుకుందో ఏమో పట్టాలవైపు పరిగెత్తింది. అంతే.. అదుపుతప్పి ట్రాక్‌పై పడిపోయింది. ఇక తన బిడ్డను కాపాడుకునేందుకు సదురు తల్లి కూడా మెట్రో ట్రాక్‌పైకి దూకేసింది. ఇక తల్లిబిడ్డను చూసిన అక్కడనున్న మిగతా ప్రయాణికులు స్పందించి వారిని కాపాడేందుకు పరుగులు తీశారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

అయితే.. ట్విస్ట్‌ ఏంటంటే అదే పట్టాలపై ట్రైన్ దూసుకొస్తుంది. ఏం చేయాలో తెలియక అంతా కంగారుపడిపోయారు. అప్పుడే మెట్రో స్టేషన్‌లో ఉన్న సెక్యూరిటీ గార్డు సమయస్పూర్తితో వ్యవహరించాడు. వికాస్‌ బంగర్‌ అనే సెక్యూరిటీ గార్డు అందరిలా పరిగెత్తకుండా స్టేషన్‌లో ఉన్న ఎమర్జెన్నసీ బటన్‌ను నొక్కాడు. దాంతో.. ఇన్‌కమింగ్ రైలు స్టేషన్‌లోకి రాకుండా ఆగిపోయింది. చిన్నారి, తల్లి పడిపోయిన స్థలానికి కేవలం 30 మీటర్ల దూరంలో ట్రైన్ ఆగింది. దాంతో.. ఇద్దరిని ఇతర ప్రయాణికులు క్షేమంగా పైకి లాగారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరి ప్రాణాలను కాపాడిన సెక్యూరిటీ గార్డును అందరూ ప్రశంసిస్తూన్నారు. అదేవిధంగా చిన్నారులతో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని పుణె మెట్రో విజ్ఞప్తి చేసింది.

Next Story