మధ్యప్రదేశ్‌లో దారుణం..యువకులను బట్టలిప్పించి కర్రలతో దాడి
మధ్యప్రదేశ్‌లో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 17 July 2023 5:19 AM GMTమధ్యప్రదేశ్‌లో దారుణం..యువకులను బట్టలిప్పించి కర్రలతో దాడి
మధ్యప్రదేశ్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అక్కడ రోజుకో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఏదైనా తప్పు చేసి చేతికి చికితే చాలు.. చితకబాదేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ముగ్గురు యువకులు తప్పుడు పని చేశారని గ్రామస్తులంతా ఏకమై దారుణంగా వ్యవహరించారు. యువకుల బట్టలు విప్పించి అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకోబెట్టి కర్రలతో చితకబాదారు. దెబ్బలను తట్టుకోలేక యువకులు ఆర్తనాదాలు చేస్తున్నా ఏమాత్రం కనికరించలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లో ఇటీవల సిద్ది జిల్లాలో ఆదివాసీ వ్యక్తిపై మూత్ర విసర్జన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు తలెత్తాయి. ఆ తర్వాత ఓ వ్యక్తితో కొందరు కాళ్లు నాకించిన ఘటన వీడియో కూడా వైరల్ అయ్యింది. తాజాగా మరో దారుణ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్మదాపురం జిల్లాలోని జవ్లీ గ్రామంలో జరిగింది ఈ ఘటన. జూలై 13న ముగ్గురు యువకులను గ్రామస్తులు చితకబాదారని పోలీసులు తెలిపారు.
జవ్లీ గ్రామంలో ముగ్గురు యువకులు గ్రామస్తులతో అసభ్యంగా ప్రవర్తించారట. దాంతో.. ఆగ్రహానికి గురైన గ్రామంలోని పలువురు వ్యక్తులు ఆ యువకులకు బుద్ధి చెప్పాలని దారుణంగా ప్రవర్తించారు. వారి బట్టలను విప్పించి.. గ్రామంలోని రోడ్లపైనే అర్థనగ్నంగా పడుకోబెట్టారు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు కర్రలు తీసుకుని వారిని చితకబాదడం ప్రారంభించారు. ఆ దెబ్బలను తట్టుకోలేక యువకులు కేకలు వేస్తున్నారు. ఇదంతా గ్రామస్తులందరి ముందే జరుగుతోంది. వారు కొట్టండి అన్నట్లుగా చూస్తూ ఉండిపోయారు. అయితే.. యువకులు చేసిన అసభ్యకరమైన పనేంటి అనేది క్లారిటీ ఇవ్వలేదు పోలీసులు. ఈ ఘటనలో యువకులను చితకబాదిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. తప్పు చేసిన వారిని ఈ విధంగా శిక్షించొచ్చని కొందరు.. ఇంకొందరు అయితే పోలీసులకు చెప్తే సరిపోయేది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
मध्य्प्रदेश(नर्मदापुरम): गांव के कुछ लोगों से बदतमीजी करने के आरोप में अमजद अली, सौरभ नागंवशी और पिन्नु नागवंशी नामक युवकों को लोगों ने बांध कर पीटा, पैर तोड़े। पुलिस ने बताया कि 6 लोगों के खिलाफ़ 6 धाराओं में मामला दर्ज़ कर नोटिस दिया गया है।@KashifKakvi pic.twitter.com/rGAdbz3RLC
— Ashraf Hussain (@AshrafFem) July 15, 2023