ఆ విషయం చెప్పలేదని రోగిని కొట్టిన డాక్టర్.. సస్పెండ్

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు హాస్పిటల్ లో చోటుచేసుకుంది ఈ దారుణ సంఘటన.

By Srikanth Gundamalla  Published on  29 Oct 2023 4:55 AM GMT
madhya pradesh, doctor suspended,  beating patient, video,

ఆ విషయం చెప్పలేదని రోగిని కొట్టిన డాక్టర్.. సస్పెండ్

డాక్టర్‌ అంటే దేవుడిలాగా కొలుస్తారు. పోతున్నాయి అనుకున్న సమయంలో ప్రాణాలును నిలబెట్టి కుటుంబంలో నవ్వులను కాపాడతాడు. రోగులకు చికిత్స చేయడమే కాదు.. మానసికంగా దగ్గరవుతూ సంతోషంగా చూసుకుంటారు. కానీ ఓ డాక్టర్‌ కోపం కట్టలు తెచ్చుకుంది. బెడ్‌పై ఉన్న ఓ రోగిని చితక్కొట్టాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు హాస్పిటల్ లో చోటుచేసుకుంది ఈ దారుణ సంఘటన. 45 ఏళ్లు ఉన్న హెచ్‌ఐవీ సోకిన ఓ వ్యక్తి ఎముక విరగడంతో ఆస్పత్రికి వచ్చాడు. ఉజ్జయినిలోని ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు అతని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి ఎంవై హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అయితే.. ఎముక విరగడంతో దానికి చికిత్స చేశారు వైద్యులు. ఫ్యాక్చర్‌ అయిన శస్త్ర చికిత్స అనంతరం కట్టుకట్టారు. అయితే.. అప్పటి వరకు డాక్టర్లకు సదురు రోగి హెచ్‌ఐవీ బాధితుడని తెలియదు. ఆ విషయం కుటుంబ సభ్యులు, అటెండర్‌ కూడా చెప్పలేదు.

ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న చికిత్స చేసిన జూనియర్‌ డాక్టర్‌ రోగి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చికిత్సకు ముందే హెచ్‌ఐవీ ఉందన్న విషయం చెప్పాలి కదా అంటూ ఫైర్ అయ్యాడు. పట్టరాని కోపంతో బెడ్‌పై కట్లతో ఉన్న రోగిని చెంపదెబ్బలు కొట్టాడు. పదేపదే కొడుతూ రోగిని దుర్భాషలాడాడు. అయితే.. డాక్టర్‌ సదురు రోగిని చెంపదెబ్బలు కొడుతుండగా అక్కడే ఉన్న కొందరు చాటుగా వీడియో తీశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ సంఘటనపై స్పందించిన మహారాజా యశ్వంతరావు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ ప్రమేంద్ర కుమార్‌ ఠాకూర్‌ చర్యలు తీసుకున్నారు. జూనియర్‌ డాక్టర్‌ కౌశల్ ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై డీన్ డాక్టర్ సంజయ్ దీక్షిత్ ఈ కేసును దర్యాప్తు చేసి మూడు రోజుల్లో నివేదికను సమర్పించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారని ఠాకూర్ తెలియజేశారు.

"మేము రోగిని విరిగిన ఎముక చికిత్స కోసం MYH కి తీసుకువచ్చాము. అతనికి అప్పటికే HIV సోకింది. HIV ఇన్ఫెక్షన్ గురించి తెలియజేయనందుకు జూనియర్ డాక్టర్ అతన్ని కొట్టాడు. దాడిని ఆపడానికి నేను జోక్యం చేసుకున్నప్పుడు నన్ను కూడా కొట్టారు." అని రోగి బంధువు తెలిపారు.

Next Story