రోడ్డుమీద స్కూటీపై కూర్చొని రొమాన్స్.. వీడియో వైరల్ కావడంతో..
Lucknow police searching for couple after video of them romancing on scooty goes viral. రోడ్డు మీద స్కూటీపై రైడ్ చేస్తూ ఓ జంట హల్‌చల్ చేసింది. స్కూటీపై వెళ్తూనే జంట రొమాన్స్ చేసింది.
రోడ్డు మీద స్కూటీపై రైడ్ చేస్తూ ఓ జంట హల్‌చల్ చేసింది. స్కూటీపై వెళ్తూనే జంట రొమాన్స్ చేసింది. అందరూ చూస్తూండగానే ఆ జంట బరితెగించింది. నాలుగు గోడల మధ్య రహస్యంగా చేయాల్సిన పనిని స్కూటిపై వెళ్తూ బహిరంగంగా చేయడంతో చూస్తున్న వారందరూ నివ్వెరపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గల హజ్రత్‌గంజ్ ప్రాంతంలో జరిగింది. ఓ యువకుడు తన స్కూటీ నడుపుతుండగా అతనికి వ్యతిరేక దిశలో యువతి అసభ్యకరంగా కూర్చుంది. ఆమె కాళ్లను అతని నడుముకు, చేతులను మెడకు పెనవేసుకుని కూర్చుంది. ఆపై అతడికి ముద్దుల వర్షం కురిపించింది. జంట కదులుతున్న స్కూటీపై కూర్చుని రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లక్నో పోలీసులు ఇప్పుడు ఆ జంటపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు ఆ దృశ్యాలను పరిశీలించడం ప్రారంభించారు. లక్నో సెంట్రల్ జోన్‌లోని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్, అపర్ణ రజత్ కౌశిక్.. వీడియో లక్నోకి చెందినదని, హజ్రత్‌గంజ్ ప్రాంతంలో తీసినదని ధృవీకరించారు. జంట కోసం రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. వారిని పట్టుకునేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అశ్లీలత ప్రచారం చేసిన జంటపై మోటారు వాహన చట్టం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
चलती स्कूटी में बीच सड़क इश्क़ का खुल्लम खु्ल्ला इज़हार।