శ్రీశైలంలో చిరుత పులి కలవరపెడుతోంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్టు సీసీ కెమెరాల్లో రికార్డై దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్‌కు గురైంది. కొద్ది నెలలుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అటు అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం కన్నెపల్లి రోడ్డులో కూడా మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రెండు ఆవుదూడలపై చిరుత దాడి చేసి చంపేసింది. చిరుత సంచారంతో తీవ్ర భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్తున్నారు. చిరుత దాడుల నుంచి తమను రక్షించాలని ప్రభుత్వాన్ని స్థానిక ప్రజలు కోరారు.