రిపేర్‌కి తీసుకెళ్తుండగా ఆకాశంలో నుంచి జారిపడ్డ హెలికాప్టర్ (వీడియో)

రిపేర్‌కు వచ్చిన ఓ హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా.. ఉన్నట్లుండి కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on  31 Aug 2024 1:15 PM IST
రిపేర్‌కి తీసుకెళ్తుండగా ఆకాశంలో నుంచి జారిపడ్డ హెలికాప్టర్ (వీడియో)

కేదార్‌నాథ్‌లో ప్రమాదం సంభవించింది. రిపేర్‌కు వచ్చిన ఓ హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా.. ఉన్నట్లుండి కుప్పకూలింది. ఆకాశంలో నుంచి జారిపడ్డ హెలికాప్టర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్మీ హెలికాప్టర్‌కు కేబుల్స్‌తో కట్టి రిపేర్ అయిన హెలికాప్టర్‌ను తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అధిక బరువు ఉండటంతో పాటు..విపరీతంగా గాలులు వీయడంతో బ్యాలెన్స్ కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. దాంతో.. రిపేర్ అయిన హెలికాప్టర్‌ను అలాగే తీసుళ్తే రెండంటికీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి దాన్ని వదిలేశారు. దాంతో.. భారీ ఎత్తునుంచి రిపేర్ అయిన హెలికాప్టర్ కింద పడిపోయింది. కొండ రాళ్లలో పడిపోయిన ఆ హెలికాప్టర్.. పూర్తిగా ధ్వంసం అయ్యింది. లింఛోలి ఏరియాలో మందాకిని నదిలో ఈ హెలికాఫ్టర్ పడిపోయింది.

కాగా.. కేదార్‌నాథ్‌కు భక్తులను తరలించేందుకు హెలికాప్టర్‌ను ఉపయోగిస్తుంటారు. గత మే నెలలో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.. అప్పటి నుంచి ఆ ట్రావెల్స్ కంపెనీ హెలికాప్టర్‌ను పక్కన పెట్టింది. శనివారం దానిని మరమ్మతు చేయించడానికి ఏర్పాట్లు చేసింది.. ఆర్మీకి చెందిన ఎంఐ–17 ఛాపర్ తో ఈ హెలికాఫ్టర్ ను గౌచర్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కేబుల్స్‌తో బిగించిన తర్వాత హెలికాప్టర్‌ గాల్లోకి ఎగిరింది. దాంతో పాటు రిపేర్ అయిన హెలికాప్టర్ కూడా గాల్లోకి వెళ్లింది. కొద్దిదూరం వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాలులతో ఎంఐ 17 చాపర్‌ ఒడిదుడుకులకు లోనైంది. దాంతో.. పైలట్లు రిపేర్ అయిన హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈమేరకు అధికారులు వివరణ ఇచ్చారు.



Next Story