ఈ చిన్న పిన్నీసు 69000 రూపాయలట!!
ఒక సాధారణ ప్రాదా కంపెనీకి చెందిన యాక్సెసరీ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం దాని ధర.
By - అంజి |
ఈ చిన్న పిన్నీసు 69000 రూపాయలట!!
ఒక సాధారణ ప్రాదా కంపెనీకి చెందిన యాక్సెసరీ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం దాని ధర. ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ సేఫ్టీ పిన్ ను తీసుకుని వచ్చింది. ఇది మన దగ్గర ఉన్న దుకాణాలలో పది రూపాయలకు ఓ ప్యాకెట్ కూడా లభిస్తుంది.
అయితే "క్రోచెట్ సేఫ్టీ పిన్ బ్రూచ్" గా వర్ణించబడిన ఈ వస్తువుకు రంగురంగుల క్రోచెట్ దారంతో చుట్టారు. సిగ్నేచర్ ప్రాడా ట్రయాంగిల్ లోగో ఉంది. దీని ధర చూస్తే షాక్ అయిపోతాం. ఎందుకంటే ఏకంగా 775 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో 69,000 రూపాయలు. "ప్రాదా కంపెనీకి సంబంధించిన సొగసైన సేఫ్టీ పిన్" అని వెబ్‌సైట్‌లోని వివరణలో ఉంది. ఈ ఐటమ్ కు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
గతంలో, ప్రాదా సంస్థ రూ. 1.2 లక్షల ధరతో కొల్హాపురి శైలి చెప్పులను విడుదల చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. మహారాష్ట్ర నుండి వచ్చిన సాంప్రదాయ చేతితో తయారు చేసిన పాదరక్షల నుండి ప్రేరణ పొందిన ఈ చెప్పులు, వాటి అధిక ధర, చేతివృత్తులవారికి గుర్తింపు లేకపోవడం వల్ల విమర్శలను ఎదుర్కొంది. ప్రాదా తమ డిజైన్‌ను కాపీ చేసినట్లు ఆరోపిస్తూ భారతీయ కళాకారులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేయడంతో వివాదం మరింత ముదిరింది.