Hyderabad: సచివాలయం ముందే బైక్‌ స్టంట్స్‌.. వీడియో వైరల్

హైదరాబాద్‌ నగరంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 Nov 2023 12:53 PM IST
hyderabad, youth hulchal,  tank bund, secretariat,

Hyderabad: సచివాలయం ముందే బైక్‌ స్టంట్స్‌.. వీడియో వైరల్

హైదరాబాద్‌ నగరంలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇంతకు ముందు ఖాళీగా ఉన్న రోడ్లలో రేసింగ్‌లు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు జనాలు ఎక్కువగా తిరుగుతున్న ప్రాంతాల్లో కూడా డేంజర్‌ స్టంట్స్‌ చేస్తున్నారు. బైక్‌ ముందు టైర్‌ లేపి నడిపిస్తున్నారు. ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా ఓ యువకుడు నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌.. సచివాలయం ముందు బైక్‌తో స్టంట్స్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

హైదరాబాదులో పోకిరిలు రెచ్చిపోతున్నారు. నానాటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా బైక్ స్టంట్ లు చేస్తున్నారు. విశాల ప్రాంతంలో ఈ బైక్ స్టంట్ లో ఎక్కువగా నిర్వహిస్తున్నారు.ఇటీవల హైదరాబాద్ నగరంలో నిర్మించిన సచివాలయం, స్టీల్ బ్రిడ్జి, షేక్‌పేట్‌ బ్రిడ్జి పైన ఈ బైక్ స్టంట్ ఎక్కువగా నడుస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో లైకుల కోసం బైక్ స్టంట్ వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు పోకిరీలు. వీటికి వస్తున్న విపరీతమైన క్రేజ్‌ని చూసి కొత్త కొత్త ఏరియాలో బైక్ స్టంట్ వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. బైక్ స్టంట్ లు చేస్తున్న పోకిరిల పైన పోలీసులు దృష్టి సారించారు. సచివాలయం వద్ద, షేక్‌పేట బ్రిడ్జిపై బైక్‌తో స్టంట్స్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ మూడు సంఘటనలపై కేసులు నమోదు చేశారు. వీడియోల ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story