మీది మొత్తం 1000 అయ్యింది.. హైదరాబాద్‌ పోలీసుల ట్వీట్ వైరల్

తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కుమారి ఆంటీ డైలాగ్‌ను వాడేశారు.

By Srikanth Gundamalla  Published on  20 Feb 2024 3:29 PM IST
hyderabad, traffic police, tweet, viral,


 మీది మొత్తం 1000 అయ్యింది.. హైదరాబాద్‌ పోలీసుల ట్వీట్ వైరల్

కుమారీ ఆంటీ అంటే తెలియనవారు ఉండరు. ఎందుకంటే ఆమె గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. యూట్యూబ్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ ఇలా అన్ని ఫ్లాట్‌ఫాముల్లో కనిపించింది. ఎక్కడ చూసిన ఆమె గొంతు.. వీడియోలే దర్శనం ఇస్తున్నాయ్. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో రోడ్డు పక్కన చిన్న ఫుడ్‌ స్టాల్‌ కుమారి ఆంటింది. ఆమె ఒక సామాన్యురాలు. అయితే.. కుమారి ఆంటీ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్‌ ఫేమస్‌ చేసింది. ' మీది మొత్తం థౌజండ్‌ అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్‌ట్రా' ఈ ఒక్క డైలాగ్‌ కుమారి ఆంటీ లైఫ్‌నే మార్చేసింది. సోషల్‌ మీడియాలో ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఫుడ్‌ స్టాల్‌ వద్దకు వెళ్లారు. నెటిజన్లతో పాటు సినీ హీరోలు సైతం ఆమె వద్దకు వెళ్లి సినిమాలకు ప్రమోషన్స్‌ చేసుకునే రేంజ్‌లో ఎదిగిపోయింది.

అయితే.. ఫేమస్‌ అయిన తర్వాత కుమారి ఆంటీకి కాస్త ఇబ్బందులు తప్పలేదు. ఫుడ్‌ స్టాల్‌ వద్ద రద్దీ బాగా పెరిగిపోయింది. దాంతో.. ట్రాఫిక్‌ పోలీసులు ఫుడ్‌ కోర్టు ఎత్తేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఈ విషయం సీఎం రేవంత్‌ దృష్టికి వెళ్లింది. ఆయన ఆదేశాలతో అక్కడే కొనసాగించేందుకు మార్గం సుగమం అయ్యింది.

అయితే.. తాజాగా హైదరాబాద్ నగర పోలీసులు కుమారి ఆంటీ డైలాగ్‌ను వాడేశారు. ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెడుతూ.. ఈ డైలాగ్ రాసుకొచ్చారు. బుల్లెట్‌ పై వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాడు. అంతేకాదు ఫోన్లో కూడా మాట్లాడుతున్నాడు. అయితే.. దీని కోసం అతనికి రూ.1000 ఫైన్ విధించారు నగర పోలీసులు. ఈ మేరకు ఆ ఫోటను షేర్‌ చేస్తూ.. 'మీది మొత్తం 1000 అయ్యింది... యూజర్‌ చార్జీలు ఎక్స్‌ట్రా ' అంటూ కుమారి ఆంటీ డైలాగ్‌ను క్యాప్షన్‌గా ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు కుమారి ఆంటీ డైలాగే అంటూ కామెంట్స్‌ చేస్తూ నవ్వుతోన్న ఎమోజీలను పోస్టు పెడుతున్నారు. కుమారి ఆంటీని ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. అయితే.. హైదరాబాద్‌ నగర పోలీసులు.. ట్రాఫిక్‌ నిబందనలు తరచూ ప్రచారం నిర్వహిస్తుంటారు. వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు విభిన్న మార్గాల్లో ఇలా ప్రచారం చేస్తుంటారు.


Next Story