చైన్‌ స్నాచర్లకు బుద్ధి చెప్పిన బస్సు డ్రైవర్ (వీడియో)

హర్యానాలోని కర్నాల్‌ ప్రాంతంలో పట్టపగలే ఇద్దరు దొంగలు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

By Srikanth Gundamalla  Published on  30 May 2024 7:40 AM IST
haryana, chain snatching, bus driver, viral video,

 చైన్‌ స్నాచర్లకు బుద్ధి చెప్పిన బస్సు డ్రైవర్ (వీడియో) 

దొంగలు రెచ్చి పోతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉంటే చాలు రెక్కీ నిర్వహించి.. చోరీలు చేస్తుంటారు. ఇంకొందరు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతారు. ఇలాంటి చోరీలు అవతలి వారి ప్రాణాలను కూడా బలితీసుకుంది. తాజాగా ఇద్దరు వ్యక్తులు హర్యానాలో ఓ మహిళ నుంచి చైన్‌ స్నాచింగ్‌కు ప్రయత్నించారు. అయితే.. వీరిని గమనించిన ఒక బస్సు డ్రైవర్‌ దొంగలకు సరైన బుద్ధి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హర్యానాలోని కర్నాల్‌ ప్రాంతంలో పట్టపగలే ఇద్దరు దొంగలు చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను పాలో చేసి ఆమె మెడలో నుంచి చైన్‌ను లాక్కున్నాడు ఒక వ్యక్తి. ఆ తర్వాత అక్కడ నుంచి పరుగు తీశాడు. కాస్త ముందే మరో వ్యక్తి బైక్‌పై పారిపోయేందుకు రెడీగా ఉన్నాడు. బైక్‌ స్టార్ట్‌లోనే ఉంచాడు. అతను చైన్‌ లాక్కుని వేగంగా పరుగెత్తుకువచ్చి.. బైక్‌ ఎక్కాడు. ఇక పారిపోదాం అనుకున్న సమయానికి బస్సు డ్రైవర్‌ వారి పాలిట యముడిగా ఎంట్రీ ఇచ్చాడు. చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న విషయాన్ని దూరం నుంచే చూసిన బస్సు డ్రైవర్.. నేరుగా వెళ్లి దొంగల బైక్‌ను ఢీకొట్టాడు. దాంతో.. వారిద్దరూ ఒక్కసారిగా కిందపడిపోయారు.

ఇక జనాలకు దొరికతే చావ బాదుతారనే భయంతో అక్కడే బైక్‌ను వదిలేసి పారిపోయారు. ఇక బాధిత మహిళ చైన్ లాక్కెళ్తున్నారు.. దొంగలు.. పట్టుకోండి.. అంటూ వెనకాలే రాసాగింది. కానీ.. భయంతో చైన్‌ స్నాచర్లు బైక్‌ను అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ దృశ్యాలు రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇదే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు బస్సు డ్రైవర్ చేసిన పనిని అభినందిస్తున్నారు. కానీ బస్సు కింద పడితే మాత్రం వారిపని అయిపోయేదని కామెంట్స్ చేస్తున్నారు. బస్సు వేగంగా లేదనీ. అందుకే వారి లేచి పారిపోగలిగారంటూ వివరణలు ఇస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ నంబరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే చైన్ స్నాచర్లను పట్టుకుంటామని చెబుతున్నారు


Next Story