'హనుమాన్‌' సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయిన మహిళ (వీడియో)

సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల్లో ఒకటి హనుమాన్. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైనా కూడా పెద్ద సినిమాలతో పోటీ పడింది.

By Srikanth Gundamalla  Published on  30 Jan 2024 12:28 PM IST
hanuman, movie, theatre, woman, viral video,

'హనుమాన్‌' సినిమా చూస్తూ పూనకంతో ఊగిపోయిన మహిళ (వీడియో)

సంక్రాంతి సందర్భంగా విడుదలైన సినిమాల్లో ఒకటి హనుమాన్. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైనా కూడా పెద్ద సినిమాలతో పోటీ పడింది. విజువల్ ఎఫెక్ట్స్‌.. సినిమా స్టోరీ ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి. దాంతో.. సంక్రాంతి నుంచి ఇప్పటికీ కూడా థియేటర్లలో హనుమాన్ మూవీ సందడి చేస్తూనే ఉంది. ఇంకా చాలా చోట్ల హౌస్ ఫుల్‌ కలెక్షన్లతో దూసుకుపోతుంది. కాగా.. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.250 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసింది. త్వరలోనే రూ.300 కోట్ల క్లబ్‌లో కూడా చేరబోతుందని అంచనా వేస్తున్నారు.

ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం రికార్డు కలెక్షన్లు రాబడుతోంది హనుమాన్ సినిమా. అక్కడ 15 రోజులకు గాను ఏకంగా 5 మిలియన్ కలెక్షన్లు రాబట్టి టాప్ స్టార్స్‌కు సైతం సాధ్యం కాని రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా కోసం జనాలు ఇంకా థియేటర్లకు క్యూ కడుతున్నారు. అద్భుతమైన విజువల్స్‌ను చూసి థ్రిల్ అవుతున్నారు. భక్తితో ఇంకొందరు కూడా వెళ్తున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ యూనివర్స్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన హనుమంతుడిని తెరపై చూపించిన విధానం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

అయితే.. తాజాగా హనుమాన్‌ సినిమా రన్‌ అవుతోన్న థియేటర్లో విచిత్ర సంఘటన జరిగింది. హనుమాన్ సినిమా చూడటానికి వెళ్లిన మహిళ ఉన్నట్లుండి పూనకంతో ఊగిపోయింది. పెద్ద అరుస్తూ పూనకంతో ఊగింది. ఒక వైపు సినిమా నడుస్తుండగానే ఆ మహిళ అలా ఊగిపోవడంతో ఇతర ప్రేక్షకులు కాస్త కంగారు పడినా తర్వాత అర్థం చేసుకుని సినిమా చూశారు. అయితే.. పూనకం వచ్చిన మహిళను పక్కన కూర్చున్నవారు ఎంత ఆపిన ఆగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ ఈడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. హనుమాన్‌ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతుందని డైరెక్టర్‌ ఇప్పటికే చెప్పారు.

Next Story