పెంపుడు కుక్కలకు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి.. వీడియో వైరల్

Gurugram couple conducts full marriage rituals for pet dogs. హర్యానాలోని గురుగ్రామ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఆలోచన వచ్చిందే తడవు.. గురుగ్రామ్‌కు చెందిన ఇ

By అంజి  Published on  14 Nov 2022 3:54 AM GMT
పెంపుడు కుక్కలకు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి.. వీడియో వైరల్

హర్యానాలోని గురుగ్రామ్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఆలోచన వచ్చిందే తడవు.. గురుగ్రామ్‌కు చెందిన ఇరుగుపొరుగున ఉండే వారు తాము పెంచుకుంటున్న కుక్కలకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశారు. అచ్చం మనుషులకు పెళ్లి ఎలా చేస్తారో.. ఈ కుక్కలకు కూడా అలానే పెళ్లి చేశారు. బాజా భజంత్రీలు, డీజే చప్పుళ్లతో గ్రాండ్‌గా మ్యారేజ్‌ చేశారు. ఈ వివాహానికి బంధువులు కూడా పెద్ద సంఖ్యలోనే వచ్చారు. ఈ వైరల్‌ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గురుగ్రామ్‌కు చెందిన రాణి, మనీత కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. వారికి స్వీటీ (ఆడ కుక్క), షేరూ అనే పెంపుడు కుక్కలు ఉన్నాయి. రాణికి సంతానం లేకపోవడంతో స్వీటీని తన కన్నబిడ్డలా పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే చాలా మంది స్వీటీ పెద్దదయిందని, దానికి ఇక పెళ్లి చేయాలని అంతా అంటుండేవారు. మొదట ఈ విషయాలను తాను పట్టించుకోలేదని, అయితే ఓ సారి పక్కనే ఉన్న మనీత.. తమ షేరూతో స్వీటీకి పెళ్లి చేద్దామని చెప్పిందని తెలిపింది. దీంతో ఈ విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకుని, నాలుగు రోజుల్లోనే వాటి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాణి తెలిపింది.

హిందూ సాంప్రదాయంలో వాటికి వివాహం చేశామని, మొత్తం 100 మందిని వివాహానికి ఆహ్వానించామని మనీత చెప్పారు. 25 కార్డులు ముద్రించి పంచామని, మిగతావారికి ఆన్‌లైన్‌లో, ఫోన్‌ ద్వారా ఆహ్వానించామన్నారు. పెళ్లికి ఒక రోజు ముందు.. రెండు శునకాలకు హల్దీ వేడుక కూడా చేశారు. పెళ్లికి వచ్చినవారు ఆ రెండు కుక్కల మ్యారేజ్‌ వేడుకను ఎంజాయ్‌ చేశారని, డ్యాన్సులు కూడా చేశారని రాణి అన్నారు. అయితే ఆహ్వాన సమయంలో కొంతమందికి తాము పెళ్లికి వస్తామని చెప్పగా, మరికొందరు పట్టించుకోలేదని, అయినా తాము కోరుకున్నది చేశామని మనీత చెప్పారు.


Next Story
Share it