లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలిక..హే భగవాన్ అంటూ అరుపులు (వీడియో)
ఓ బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు తీవ్ర భయాందోళనకు గురైంది.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 12:35 PM ISTలిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలిక..హే భగవాన్ అంటూ అరుపులు (వీడియో)
ఆఫీసులు.. మాల్స్‌లోనే కాదు.. ఇప్పుడు అపార్ట్‌మెంట్స్‌లో కూడా లిఫ్ట్ మస్ట్ అయిపోయింది. చిన్నవారి నుంచి పెద్దవారి వరకూ రెండు ఫ్లోర్ల పైన ఉంటే లిఫ్ట్‌లో వెళ్లాల్సిందే. అయితే.. లిఫ్ట్ ద్వారా కొంచెం కూడా ఆయాసం లేకుండా బిల్డింగ్ ఎక్కేయొచ్చు. అయితే.. దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం గమనించాలి. బుధవారం ఓ బాలిక లిఫ్ట్‌లో ఇరుక్కుపోయింది. ఉన్నట్లుండి లిఫ్ట్ మధ్యలో ఆగిపోవడంతో ఆ బాలిక చాలా భయడిపోయింది. ఒక్కతే ఉండటంతో వణికిపోయింది. హే భగవాన్ అంటూ అరుపులు మొదలుపెట్టింది. దాదాపు 20 నిమిషాల పాటు లిఫ్ట్‌లోనే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ బాలికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లిఫ్ట్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని అందరూ గమనించాలి. చిన్నపిల్లలను ఒక్కరినే లిఫ్ట్‌లోకి అనుమతించవొద్దు అనేది గ్రహించాలి. పొరపాటు వారు లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే భయపడిపోతారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటని ఆలోచించాలి. లక్నోలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. గౌరీభాగ్ ప్రాంతంలోని కుర్సీ రోడ్డులో జ్ఞానేశ్వర్ ఎంక్లేవ్ అపార్ట్‌మెంట్ ఉంది. కాంప్లెక్స్ లిఫ్ట్‌లో పదేళ్ల వయసు ఉన్న చిన్నారి ఎక్కింది. అయితే.. అనుకోని విధంగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. దాంతో.. ఆ చిన్నారి గుండె ఆగిపోయినంత పని అయ్యింది. బయటకు వచ్చేందుకు నానా ప్రయత్నాలు చేసింది. హే భగవాన్ అంటూ ఆర్తనాదాలు చేసింది. రెండు చేతులతో లిఫ్ట్ డోర్లు తెరిచేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. అయితే.. గ్రిల్‌తో కూడిన మాన్యువల్ లిఫ్ట్ కాదు.. పూర్తిగా మూసుకుపోయే ఆటోమెటిక్ లిఫ్ట్. లోపలి నుంచి బాలిక ఎంతగా అరిచినా బయటకు వినిపంచలేదు. అలా దాదాపు 20 నిమిషాల పాటు పాప లోపలే ఉండిపోయింది. ఆ పాప పడిన బాధ, అరుపులు మొత్తం అందులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
అయితే.. చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కున్న విషయాన్ని చివరకు ఎలా గుర్తించారో తెలియదు కానీ.. 20 నిమిషాల తర్వాత బాలికను బయటకు తీశారు. ఈ సంఘటనపై సోషల్ మీడియా యూజర్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. లిఫ్టుల్లో చిన్నారులను ఒంటరిగా పంపొద్దని చెబుతున్నారు. అంతేకాదు.. లోపల ఉన్నవారు మాట్లాడితే బయటకు వినపడేలా ఏదైనా టెక్నాలజీని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.