టేకాఫ్‌ సమయంలో ఊడిపోయిన విమాన చక్రం (వీడియో)

విమానం టేకాఫ్‌ తీసుకుని గాల్లోకి ఎగరగానే దాని టైరు ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 12:05 PM IST
flight,  tire,  take off, viral video,

టేకాఫ్‌ సమయంలో ఊడిపోయిన విమాన చక్రం (వీడియో)

అమెరికాలో విమానం ప్రమాదం జరిగింది. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విమానం టేకాఫ్‌ తీసుకుని గాల్లోకి ఎగరగానే దాని టైరు ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతోంది. టైరు ఊడిపోయిన విషయాన్ని గ్రహించిన పైలట్లు ఆ విమానాన్ని అత్యవసరంగా దగ్గరలోని ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.

యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ -777-200 విమానం గురువారం ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి జపాన్‌కు వెళ్లాల్సి ఉంది. ఒకాసా విమానాశ్రయంలో ల్యాండింగ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే.. విమానం శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ తీసుకుంది. అదే సమయంలో విమానం వెనకవైపు ఉన్న ల్యాండింగ్‌ గేర్‌లోని ఒక టైరు ఊడిపోయింది. అయితే.. విమానం టైరు ఊడిపోయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆ టైరు ఎయిర్‌పోర్టు పరిధిలోనే ఊడిపోవడంతో పార్కింగ్‌లో ఉన్న కారుపై పడిపోయింది. దాంతో.. కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారుపై విమానం టైరు పడ్డ సమయంలో అందులో ఎవరూ లేరు. దాంతో .. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

మరోవైపు పైలట్లు విమానం టైరు ఊడిన విషయాన్ని గ్రహించారు. వెంటనే విమానాన్ని దారి మళ్లించారు. లాస్‌ ఏంజిల్స్‌ ఎయిర్‌పోర్టులో ఎమర్జున్సీగా ల్యాండ్ చేశారు. ఆ విమానం ఒక టైరు లేకపోయినా సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ప్రయాణికులను మరో విమానంలో తమ డెస్టినేషన్‌కు పంపినట్లు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. బోయింగ్‌-777 విమానాల్లో చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారని తెలిపారు అధికారులు. దీనిపై కేసు నమోదు చేశామనీ..దర్యాప్తు జరుపుతున్నట్లు ఫెడరల్‌ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.

Next Story