ఐదు ఉద్యోగాలు.. వెయ్యి మంది అభ్యర్థులు.. తొక్కిసలాట

గుజరాత్‌లోని భరూజ్‌ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  11 July 2024 2:35 PM GMT
five jobs, 1000 applicants, gujarat, hotel video,

 ఐదు ఉద్యోగాలు.. వెయ్యి మంది అభ్యర్థులు.. తొక్కిసలాట 

గుజరాత్‌లోని భరూజ్‌ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఐదు ఉద్యోగాల భర్తీ విషయాన్ని తెలుసుకున్న నిరుద్యోగులు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఐదు ఉద్యోగాలు ఉండగా.. దాదాపు వెయ్యి మందికి పైగా అభ్యర్థులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్‌ ఇంటర్వ్యూలో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నెల 9వ తేదీన అంకలేశ్వర్‌లోని హోటల్ లార్డ్స్‌ ప్లాజాలో ఒక కెమికల్ సంస్థ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రకటన ముందే వెలువరించింది. దీనికి గురించి తెలుసుకున్న నిరుద్యోగులు భారీ ఎత్తున వచ్చారు. షిఫ్ట్ ఇన్‌ఛార్జ్, ప్లాంట్ ఆపరేటర్, సూపర్‌వైజర్, ఫిట్టర్, మెకానికల్, ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌ కోసం వెయ్యి మందికిపైగా తరలివచ్చారు. రెజ్యూమ్ కాపీలను చేతుల్లో పట్టుకున్న అబ్యర్థులు గుంపులుగా నిలబడ్డారు. హోటల్‌ గేటు నుంచి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట జరుగడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా రైలింగ్‌ ఒంగిపోగా దాని పై నుంచి కొందరు కిందపడ్డారు. గందరగోళానికి దారితీసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Next Story