స్కూటర్లను ఫ్లైఓవర్ పై నుండి కింద పడేసిన జనం.. ఎందుకో తెలుసా?

బెంగుళూరు సమీపంలోని ఫ్లైఓవర్ పై నుంచి జనం రెండు స్కూటర్లను కిందకు విసిరేశారు. అందుకు కారణం ఏమిటో తెలుసా

By అంజి  Published on  18 Aug 2024 9:00 PM IST
Fed Up With Stunt Riders, People Throw 2 Scooters, Bengaluru Flyover

స్కూటర్లను ఫ్లైఓవర్ పై నుండి కింద పడేసిన జనం.. ఎందుకో తెలుసా? 

బెంగుళూరు సమీపంలోని ఫ్లైఓవర్ పై నుంచి జనం రెండు స్కూటర్లను కిందకు విసిరేశారు. అందుకు కారణం ఏమిటో తెలుసా? రద్దీగా ఉండే ఫ్లైఓవర్‌పై విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ ఉండడమే. ఎంత చెప్పినా వినకపోవడంతో స్థానిక ప్రజలు కోపం తెచ్చుకున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు మరోసారి స్టంట్స్ చేస్తూ పట్టుబడ్డారు. దీంతో జనమంతా కలిసి ఆ బైక్ లను ఫ్లై ఓవర్ నుండి కిందకు పడేశారు.

ఆగస్టు 15న బెంగళూరు సమీపంలోని నెలమంగళ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై కొందరు వ్యక్తులు ద్విచక్రవాహనాలపై ప్రమాదకర విన్యాసాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉండగా ఫ్లైఓవర్ నుండి రెండు స్కూటర్లను కింద ఉన్న రహదారిపైకి విసిరారు. ఫ్లై ఓవర్‌పై విన్యాసాలు చేస్తున్న వారు అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో బెంగళూరు పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి పలువురిపై కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతను ప్రమాదంలో పడేశారంటూ బెంగుళూరు పోలీసులు 36 మందిపై కేసులు నమోదు చేశారు. విన్యాసాలు చేస్తున్న వారిపైనా, స్కూటర్లను కిందకు పడేసిన వారిపైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story