బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‌లో షేప్ ఆఫ్ యూ పాటను పాడారు. అయితే ముందస్తు అనుమతి లేకుండా లైవ్ ప్రదర్శన చేపట్టారంటూ ఓ పోలీసు ఎంటరై ఎడ్ షీరన్ పాడుతుండగానే మైక్ వైర్ తీసివేశాడు. తాము ముందస్తు అనుమతి తీసుకున్నామని దానిని అధికారులు తిరస్కరించారని ఎడ్ షీరన్ టీమ్ తెలిపింది. అయితే వారికి ఇంకా అనుమతి ఇవ్వలేదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా బెంగళూరు పోలీసు తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగతా ఈ బ్రిటిష్ సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నాడు. అతను ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలలో తన ప్రదర్శనలు ఇచ్చాడు. చెన్నైలో జరిగిన మ్యూజిక్ ప్రోగ్రామ్‌లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్.రెహమాన్‌తో కలిసి ఎడ్ షీరన్ క్లాసిక్ ఊర్వశి సాంగ్‌ను పాడారు.