అయోధ్యలో కోహ్లీ డూప్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం (వీడియో)

కోహ్లీ డూప్‌ అయోధ్యలో సందడి చేశాడు. అతన్ని చూసిన జనాలు సెల్ఫీల కోసం పరిగెత్తారు.

By Srikanth Gundamalla  Published on  23 Jan 2024 5:07 AM GMT
duplicate virat kohli,  ayodhya,   selfie , viral video,

అయోధ్యలో కోహ్లీ డూప్.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం (వీడియో)

స్టార్‌ హీరోలు.. క్రికెటర్లు.. రాజకీయ నాయకులకు డూప్‌గా కొందరు ఉంటారు. అచ్చం వారిలానే గెటప్‌ చేసుకుని.. వారి పోలికలతో కనిపిస్తారు. ఒక్కసారిగా నిజమైన స్టార్లే అనిపిస్తుంది. అయితే.. టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి కూడా కొందరు డూప్‌లు ఉన్నారు. ఇప్పటికే వివిధ మ్యాచులు జరుగుతున్న సమయంలో వారిని చూశాం. తాజాగా వారిలో ఒకరైన కోహ్లీ డూప్‌ అయోధ్యలో సందడి చేశాడు. అతన్ని చూసిన జనాలు సెల్ఫీల కోసం పరిగెత్తారు. ఒక్క ఫొటో ప్లీజ్ అంటూ వెంటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయోధ్యలో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీలా ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. టీమిండియా జెర్సీ నెంబర్‌ 18 వేసుకుని రోడ్లపైకి వచ్చాడు. ఇక అయోధ్య రామాలయంలో బాలరాముడి దర్శనానికి వచ్చిన భక్తులు విరాట్‌ డూప్‌ను చూశారు. అచ్చం కోహ్లీలాగే కనిపించడంతో ఒక్క సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు. దాంతో.. అతని వెంటపడ్డారు. వాస్తవానికి అయోధ్య వేడుకకు రావాలని క్రికెటర్‌ కోహ్లీని ఆహ్వానించారు రామాలయ నిర్వాహకులు. కానీ విరాట్‌ కోహ్లీ రామాలయ ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. అయితే.. డూప్లికేట్‌ విరాట్‌ కనిపించడంతో జనాలు అతని చుట్టూ గుమికూడారు. సెల్ఫీలు, వీడియోల కోసం ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

టీమిండియా ఇంగ్లండ్‌ జట్టుతో టెస్టు సిరీస్‌ ఆడబోతుంది. మూడు టెస్టులకు గాను తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు విరాట్‌ కోహ్లీ దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడట్లేదని బీసీసీఐ అధికారులు చెప్పారు. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్‌లో తొలి టెస్టు జరగనుంది.


Next Story