ఆ మాట అన్నాడని.. పెళ్లయిన మూడు నిమిషాలకే విడాకులు
పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం సహజం.
By Srikanth Gundamalla Published on 23 July 2024 9:41 AM ISTఆ మాట అన్నాడని.. పెళ్లయిన మూడు నిమిషాలకే విడాకులు
పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. వాటిని పెద్దగా పట్టించుకోరు. వివాహ కార్యక్రమాలు కొనసాగిస్తారు. అయితే.. తాజాగా వరుడు ఒక మాట అన్నాడని నవ వధువు ఏకంగా విడాకులు తీసుకుంది. అది కూడా పెళ్లి జరిగిన మూడు నిమిషాలకే. ఈ సంఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాకింగ్ ఘటన గల్ఫ్ దేశం కువైట్ లో జరిగింది.
పెళ్లైన మూడు నిమిషాలకే ఓ జంట విడాకులు కోసం కోర్టు మెట్లేక్కింది.పెళ్లి తంతు పూర్తయ్యి పెళ్లి వేడుక నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో అనుకోకుండా పెళ్లి కూతురు కొంచెం స్లిప్ అయ్యి కింద పడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న వరుడు పెళ్లి కూతుర్ని తెలివి తక్కువ దద్దమ్మ.. స్టుపిడ్ అని కొంచెం విసుక్కున్నాడు. దాంతో ఆ మాట విన్న పెళ్లి కూతురు ఆ నిమిషమే అతనికి విడాకులు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకుంది. పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నానని పెళ్లి వారితో చెప్పి అక్కడ నుంచి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఇదే విషయంలో కోర్టు విచారణ జరిపి విడాకులు మంజూరు చేసింది.
మూడు నిమిషాలకే పెళ్లి కూతురు విడాకులకు తీసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చిన్న విషయాలకే ఇలా విడాకులుతీసుకుంటూ పోతే భార్య, భర్తలు ఎవరూ కలిసి ఉండలేరంటూ చెబుతున్నారు. కాగా.. కువైట్ చరిత్రలోనే అతి స్వల్పకాల పెళ్లిగా దీనిని కోర్టు పేర్కొంది. నిజానికి 2019లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు గా సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది.