Video: చెత్త కుండీలో రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్

పారిశుద్ధ్య కార్మికులు నిశితంగా వెతకడంతో చెన్నైలోని చెత్త కుండీలో రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ లభ్యమైంది.

By అంజి  Published on  22 July 2024 10:22 AM IST
Diamond necklace, garbage bin, Chennai, Greater Chennai Corporation

Video: చెత్త కుండీలో రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్

పారిశుద్ధ్య కార్మికులు నిశితంగా వెతకడంతో చెన్నైలోని చెత్త కుండీలో రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ లభ్యమైంది. అది చివరకు దాని యజమాని చేతిలోకి వెళ్లింది. రాజమన్నార్‌సాలైలోని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న దేవరాజ్‌ అనుకోకుండా చెత్తలో విసిరేశాడు. నెక్లెస్‌ను దేవరాజ్‌ తల్లి తన కుమార్తెకు వివాహ బహుమతిగా ఇవ్వాలనుంది. త్వరలో దేవరాజ్‌ సోదరి వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తన తప్పు తెలుసుకున్న దేవరాజ్ వెంటనే అధికారులను సంప్రదించాడు.

వ్యర్థాల నిర్వహణ కోసం చెన్నై కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఉర్బాసర్ సుమీత్‌తో డ్రైవర్ జూ. ఆంథోనిసామి నేతృత్వంలో సమీపంలోని చెత్త డబ్బాల్లో నెక్లెస్‌ను వెతకడం ప్రారంభించారు. సీనియర్ అధికారులు కూడా రికవరీ ప్రయత్నాలను పర్యవేక్షించారు. ముమ్మరంగా వెతకగా, వ్యర్థ బిన్‌లో హారం చిక్కుకుపోయి కనిపించింది. దేవరాజ్.. ఆంథోనిసామి, చెత్త సేకరణ సిబ్బంది వారి త్వరితగతిన స్పందించి విలువైన హారాన్ని తిరిగి పొందడంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story