ధోనీ నిద్రలో ఉండగా వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్..నెటిజన్లు ఫైర్
విమానంలో ధోనీ నిద్రపోతున్న వీడియోను ఎయిర్‌హోస్టెస్ రికార్డు చేసి.. సోషల్‌మీడియాలో పోస్టు చేసింది.
By Srikanth Gundamalla
ధోని నిద్రలో ఉండగా వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్..నెటిజన్లు ఫైర్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్స్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఆయన్ని ఎంతో మంది ఫాలో అవుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొందరు ధోనీ ఆటకు ఫిదా అయ్యారు. ఇతర దేశాల టీముల్లోని ఆటగాళ్లు కూడా కూల్ కెప్టెన్‌ని ఇష్టపడతారు. ధోనీ కనిపిస్తే చాలు ఫొటోలు.. వీడియోలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే.. సెలబ్రిటీలు ఫొటోలు దిగేందుకు అనుమతిచ్చినప్పుడు తీసుకుంటే ఏం ఫరవాలేదు. కానీ.. కొందరు మాత్రమే హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఈ క్రమంలోనే ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఎంఎస్ ధోని ఆయన భార్య సాక్షితో కలిసి విమానంలో ప్రయాణం చేశారు. అయితే.. విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత కాసేపటికి సీట్లోనే నిద్రపోయారు. పక్కనే భార్య సాక్షి కూడా ఉన్నారు. అయితే.. విమానంలోని ఒక ఎయిర్‌హోస్టెస్ ధోనీని గమనించింది. అతనంటే ఆమెకు బోలెడు ఇష్టం కావొచ్చు. ఉత్సాహం కనబర్చింది. ధోనీ నిద్రపోతుండగా ఎవరికీ తెలియకుండా వీడియో తీసింది. ఈ వీడియోను సోషల్‌మీడియాలోనూ అప్‌లోడ్ చేసింది. ధోనీ ఇక్కడే ఉన్నారు.. చూడండి అంటూ వీడియో తీసిన ఎయిర్‌హోస్టెస్ నవ్వుతూ పక్కనే ఉంది. కాగా.. ఇది ఎప్పుడు.. ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియలేదు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సదురు ఎయిర్‌హోస్టెస్ తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
వీడియోను చూసిన కొందరు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమాన సిబ్బంది ప్రవర్తనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ధోనీ ప్రైవసీని గౌరవించాలని సూచనలు చేస్తున్నారు. వారికి తెలియకుండా వీడియో తీయడం ప్రైవసీని దెబ్బతీయడమే అంటున్నారు. ఇది పూర్తిగా తప్పు.. ఎయిర్‌హోస్టెస్ బాధ్యతగా వహించాల్సింది అంటున్నారు. ఎవరైనా ఆమెకు ఎలా మెలగాలో చెప్పాలని కామెంట్స్ పెడుతున్నారు. విమానయాన సంస్థపైనా విమర్శలు చేస్తున్నారు.
Cutest video on the Internet today 🤩💛#WhistlePodu #MSDhoni 📹: karishma__6e pic.twitter.com/fOyRh1G079
— WhistlePodu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) July 29, 2023