హుక్కా కొడుతూ కనిపించిన ధోనీ.. వీడియో వైరల్

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీకి అభిమానులు ఎంతగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

By Srikanth Gundamalla  Published on  7 Jan 2024 12:30 PM IST
dhoni,  party, hookah,  viral video,

హుక్కా కొడుతూ కనిపించిన ధోనీ.. వీడియో వైరల్ 

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీకి అభిమానులు ఎంతగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా చాలు అభిమానులు ఒక్క ఆటోగ్రాఫ్‌ కోసం ప్రయత్నిస్తారు. ఒక్క సెల్ఫీ అయినా కావాలని బతిమాలుకుంటూ ఉంటారు. ఆయన క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా కూడా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ధోనీ ఏం చేసినా పెద్ద వార్తగా మారిపోతుంటుంది. కాగా.. తాజాగా ఎంఎస్‌ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎంఎస్ ధోనీ ఓ ప్రయివేట్‌ ఫంక్షన్‌కు హాజరు అయ్యారు. అక్కడ స్నేహితులతో కలిసి ధోనీ హుక్కా పీలుస్తూ కనిపించారు. ఎవరో ఆ సంఘటనను సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎంఎస్‌ ధోనీ హుక్కా కొడుతూ కనిపించడంతో ఆయన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ ఫిట్‌నెస్‌ కోసం ఎంఎస్‌ ధోనీ ప్రయత్నిస్తారు. అలాంటి ఆయన హుక్కా తీసుకోవడం ఏంటో అనుకుంటున్నారు. అయితే.. ఈ వీడియో ఎక్కడ తీశారు? పార్టీ ఎక్కడిది అనేది మాత్రం తెలియలేదు. ఇటీవలకు సంబంధించినది అనిమాత్రమే అర్థం అవుతోంది.

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఆయన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ధోనీ హుక్కా వీడియో వైరల్ అవుతున్న సందర్భంగా.. సీఎస్కే మాజీ సహచరుడు జార్జ్‌ బెయిలీ గతంలో చేసిన కామెంట్స్‌ కూడా వైరల్ అవుతున్నాయి. ధోనీకి కొంచె కూడా పీషా లేదా హుక్కా పొగతాగడం ఇష్టమని అతను చెప్పాడు. ధోనీ గదిలో హుక్కా సెటప్‌ ఉండేదని అన్నాడు. ధోనీ దానిని దాచుకోవాలని అనుకోడనీ.. హుక్కా పీలుస్తున్నప్పుడు అక్కడ చాలా మంది యువ ఆటగాళ్లు సరదాగా కూర్చుంటారని జార్జ్‌ బెయిలీ గతంలో చెప్పాడు. సరదాగా గడపడానికి ఇది గొప్పమార్గమని అప్పట్లో చెప్పాడు బెయిలీ. ఇక ప్రస్తుతం వీడియోకు సంబంధించి పలువురు కామెంట్స్‌ పెడుతున్నారు. ఏంటీ ధోనీ హుక్కా తీసుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు అయితే ఎవరి లైఫ్‌ వారికి నచ్చినట్లుగా ఉండొచ్చని రాసుకొస్తున్నారు.


Next Story