విమానంలో ప్రయాణికులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ధోనీ.. వైరల్ వీడియో
ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 26 May 2024 10:04 AM ISTవిమానంలో ప్రయాణికులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన ధోనీ.. వైరల్ వీడియో
ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. ఇండియన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. అతనికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. సీఎస్కే తరఫున ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే చూడాలని అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు వస్తుంటారు. ఇంకా చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు. ఇంత క్రేజ్ ఉన్న ధోనీ ఎప్పుడూ సింపుల్‌గానే కనిపిస్తారు. ఫ్యాన్స్ ఎదురైతే వారితో సరదాగా ప్రవర్తిస్తారు. తాజాగా ధోనీకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ధోనీ ఐపీఎల్‌కు కూడా ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ధోనీ ఎప్పటికీ రిటైర్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల బెంగళూరుతో ఆడిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయి 2024 ఐపీఎల్ సీజన్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఎంఎస్ ధోనీ బెంగళూరు నుంచి తన స్వస్థలం రాంచీకి పయనమయ్యాడు. అయితే.. ఆ ప్రయాణంలో ధోనీ ఓ సాధారణ ప్రయాణికుడిలా విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. తన లగేజీని తనే పైన పెట్టుకుని సీటులో కూర్చున్నాడు. ధోనీని ఎకానమీ క్లాస్‌లో చూసిన ప్రయాణికులు షాక్ అయ్యారు. ధోనీనిచూసిన ప్రయాణికులు సంతోషంతో చప్పట్లు కొట్టారు. అందులోనే ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. దాన్ని అతను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోను తెగ లైక్‌లు చేస్తూ.. షేర్ చేస్తున్నారు ధోనీ అభిమానులు. ధోనీ సింప్లిసిటీ చూసి చాలా మంది ఫిదా అయ్యారు. చాలా గొప్ప వ్యక్తిత్వం.. ఎప్పుడూ సింపుల్‌గానే ఉంటాడు అని కామెంట్స్ చేస్తున్నారు. ధోనీ చాలా భిన్నమైన వ్యక్తి అంటున్నారు. ధోనీ పక్క సీట్లో ఎవరు కూర్చున్నారో తెలియదు కానీ.. అతను చాలా అదృష్టవంతుడు అని చెబుతున్నారు నెటిజన్లు.
బెంగళూరు నుంచి రాంచీకి ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించిన ధోనీ. సర్‌ప్రైజ్ అయిన విమాన ప్రయాణికులు.. చప్పట్లు, కేరింతలతో ఖుషీ. pic.twitter.com/0gjNus8Yp3
— $h!v@ (@Shivakumar50) May 26, 2024