విగ్ర‌హాం కింద ఇరుక్కుపోయిన భ‌క్తుడు.. పూజారీతో పాటు మిగ‌తా వారు.. వీడియో

Devotee gets stuck under elephant statue at Gujarat temple.ఓ ఆల‌యానికి వెళ్లిన ఓ భ‌క్తుడు ఏనుగు విగ్ర‌హం కింద

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Dec 2022 10:03 AM IST
విగ్ర‌హాం కింద ఇరుక్కుపోయిన భ‌క్తుడు.. పూజారీతో పాటు మిగ‌తా వారు.. వీడియో

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఎక్క‌డ ఏం జ‌రిగినా క్ష‌ణాల్లో అది తెలిసిపోతుంది. అందులో కొన్ని మంచి విష‌యాలు ఉండ‌గా, మ‌రికొన్ని చెడు విష‌యాలు ఉంటాయి. ఇంకొన్ని ఆస‌క్తిక‌రంగా, ఫ‌న్నీగా ఉంటున్నాయి.

గుజ‌రాత్ రాష్ట్రంలోని ఓ ఆల‌యానికి వెళ్లిన ఓ భ‌క్తుడు ఏనుగు విగ్ర‌హం కింద నుంచి బ‌య‌ట‌కు రావాలని భావించాడు. ఇంకా ఏమీ ఆలోచించ‌లేదు. ఏనుగు విగ్ర‌హం కింద చాలా త‌క్కువ ప్లేస్ ఉంది. అయిన‌ప్ప‌టీకి తాను ఈజీగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని బావించిన ఓ భ‌క్తుడు విగ్ర‌హం కింద ఇరుక్కుపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

నితిన్ అనే యూజ‌ర్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు. ఏనుగు విగ్ర‌హం కింద ఇరుక్కుపోయిన ఆ భ‌క్తుడిని బ‌య‌ట‌కు తీసేందుకు పూజారితో స‌హా మిగ‌తా భ‌క్తులు ప్ర‌య‌త్నించారు. అయితే.. అత‌డు బ‌య‌ట‌కు వ‌చ్చాడా లేదా అన్న‌ది తెలియ‌రాలేదు. మితిమీరిన భ‌క్తి ఏదైనా స‌రే ఇలాంటి అనార్థాల‌కు దారి తీస్తుంది అని నితిన్ ఈ వీడియోకి క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ వీడియోపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


Next Story