ప్రభుత్వాస్పత్రిలో రాసలీలలు.. డాక్టర్‌, నర్సు అసభ్యకర కార్యకలాపాలు

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్, నర్సు లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  20 Jun 2024 12:10 PM IST
Chennai hospital, doctor, nurse, objectionable act

ప్రభుత్వాస్పత్రిలో రాసలీలలు డాక్టర్‌, నర్సు అసభ్యకర కార్యకలాపాలు 

చెన్నైలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్, నర్సు లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఉన్న వ్యక్తిని డాక్టర్ సుబ్బయ్య షణ్ముగం అని గుర్తించారు. ఈ వీడియో నగరంలోని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రి నుండి వచ్చింది. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో నర్సు విధులు నిర్వహిస్తోంది. ఆస్పత్రిలో డాక్టర్, నర్సు కలిసి అసభ్యకర కార్యకలాపాలకు పాల్పడ్డారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ వీడియో కలిగిన పెన్‌డ్రైవ్‌తో పాటు ఒక లేఖను ఓ జాతీయ వెబ్‌సైట్‌కి పంపించారు.

ఘటన, వీడియో గురించి అడగగా, సంబంధిత వైద్యుడిపై తమకు ఫిర్యాదు అందలేదని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా విచారణ ప్రారంభించబడింది. "డాక్టర్‌పై మాకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. అయితే, జూన్ 14 న వీడియో ప్రసారం చేయడం ప్రారంభించడంతో, దర్యాప్తు ప్రారంభించబడింది, రాయపేట ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆయిషా చెప్పారు. వివరాల ప్రకారం.. గతంలో డాక్టర్ షణ్ముగం వాహన పార్కింగ్ సమస్యపై తన పొరుగువారి ఇంటి గేట్లపై మూత్ర విసర్జన చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నాడు.

Next Story