ట్రాఫిక్ ఉందని నదిలో కారు డ్రైవింగ్.. చలాన్ వేసిన పోలీసులు

వరుస సెలువు ఉన్నాయి. దాంతో.. చాలా మంది ట్రిప్‌లకు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  26 Dec 2023 11:04 AM IST
car, driving,  river, himachal pradesh, viral video,

ట్రాఫిక్ ఉందని నదిలో కారు డ్రైవింగ్.. చలాన్ వేసిన పోలీసులు

వరుస సెలువు ఉన్నాయి. దాంతో.. చాలా మంది ట్రిప్‌లకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. న్యూఇయర్‌ వేడుకల కోసం చాలా మంది కొత్త ప్రదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాది రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌కు పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. రోడ్లన్నీ ట్రాఫిక్‌ మయం అయ్యాయి. కొత్తగా వచ్చినవారు.. స్థానికంగా ఉన్నవారు విపరీతంగా ఉన్న ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్నారు. గల్లీలు ఉంటే వాటిని ఎంచుకుంటారు. ఒకవేళ ఒకే దారి ఉంటే మాత్రం చేసేందేం లేక వేచి చూస్తారు. కానీ.. కొందరు అయితే ఏకంగా రోడ్డుమార్గాన్ని వదిలి నదిలో నుంచి ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని లహాల్‌ వ్యాలీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. చంద్రా నదిలో నుంచి కొందరు ప్రయాణికులు సాయంత్రం థార్‌ ఎస్‌యూవీలో ప్రయాణం చేశారు. అయితే.. వారు నదిలో ప్రయానం చేస్తున్న సమయంలో వాటర్ లెవల్ తక్కువగా ఉన్నాయి. దాంతో.. ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ.. ప్రమాదకరంగా ప్రయాణం చేయడం మాత్రం ఏమాత్రం సబబు కాదని ఇతర వాహనదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. స్థానికులైతే వారిపై విమర్శలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. చివరకు పోలీసుల వరకూ చేరడంతో వారు సీరియస్‌గా స్పందించారు. నదిలో ప్రయాణించి కారుకి చలానా వేశారు.

ఈ మేరకు స్థానిక ఎస్పీ మాట్లాడుతూ.. చంద్రా నదిలో థార్‌ వాహనాన్ని నడుపుతూ వెళ్లిన సంఘటన తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. సదురు వాహనంపై చర్యలు తీసుకున్నామనీ.. ఈ మేరకు ఫైన్ విధించామని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నామని అన్నారు. నదీ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని మోహరింపజేశామని ఎస్పీ తెలిపారు. క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకల వేళ హిమాచల్‌ప్రదేశ్‌కు ప్యాటకుల తాకిడి పెరిగింది. మూడ్రోజుల్లో దాదాపు 55వేల వాహనాలు అటల్‌ టన్నెల్‌ మార్గంలో ప్రయాణించారని అదికారులు చెప్పారు. ఈ వారంలో ఇంకా చాలా వాహనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. శిమ్లాలో న్యూఇయర్ వేడుకల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో పర్యాకుటలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ అధికారులను ఆదేశించారు.


Next Story