Hyderabad: డెయిరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. వీడియో

పిల్లల కోసం చాక్లెట్‌ కొంటే అందులో ఏకంగా పురుగు దర్శనం ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  11 Feb 2024 5:55 AM GMT
Cadbury chocolate, worm crawling, hyderabad ,

Hyderabad: డెయిరీ మిల్క్‌ చాక్లెట్‌లో పురుగు.. వీడియో 

పిల్లలను తీసుకుని షాపింగ్‌ కానీ.. సూపర్‌మార్కెట్‌లో సరుకులు కొనడానికి తీసుకెళ్తుంటారు. అక్కడ వారు చాక్లెట్స్‌.. ఇతర ఆహార పదార్థాలు తినాలని కొనివ్వాలని అడుగుతుంటారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఇష్టాన్ని కాదనలేక అడిగిన చాక్లెట్స్‌ కొనిస్తుంటారు. ఇక హైదరాబాద్‌లో ఇలా చేసిన ఒక వ్యక్తికి షాక్‌ ఎదురైంది. పిల్లల కోసం చాక్లెట్‌ కొంటే అందులో ఏకంగా పురుగు దర్శనం ఇచ్చింది. దాంతో.. కంగుతిన్న సదురు కస్టమర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాక్లెట్‌లో కదులుతోన్న పురుగుని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్‌కు చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి గత శుక్రవారం మెట్రోలో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో ఉన్న ఒక రిటైల్ షాపులో డెయిరీమిల్క్‌ చాక్లెట్ తీసకున్నాడు. ఇంటికి వెళ్లాక పిల్లలకు తినేందుకు ఇచ్చాడు. అయితే.. అతనే కవర్‌ ఓపెన్ చేసి చూడటంతో పురుగు కనిపించింది. అది కదులుతూ ఉండటంతో కంగుతిన్నాడు. వెంటనే మొబైల్‌ ఫోన్‌తో వీడియో రికార్డు చేశాడు. ఆ తర్వాత వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఎక్స్‌పైరీ గడువు ముగిసిన చాక్లెట్‌ను అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌ అయ్యింది.

ఈ అంశంపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు తినే చాక్లెట్లలో ఇలా పురుగులు కనిపించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదురు కంపెనీని కోర్టుకు ఈడ్చాలనీ..ఫుడ్‌ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఈ ట్వీట్‌పై క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్‌ కూడా స్పందించింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.


Next Story