Video: అగ్నిగుండంలో పడి ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని ఆరంబాక్కం ఆలయ ఉత్సవాల్లో భాగంగా అగ్ని గుండంలో నడకలో భాగంగా మండుతున్న అగ్ని కీలలపై పడి 7 ఏళ్ల బాలుడికి కాలిన గాయాలయ్యాయి.

By అంజి  Published on  13 Aug 2024 12:34 PM IST
Boy falls during firewalking ritual, Tamil Nadu temple,  Arambakkam, Thiruvallur

Video: అగ్నిగుండంలో పడి ఏడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని ఆరంబాక్కం సమీపంలో ఆదివారం ఆలయ ఉత్సవాల్లో భాగంగా అగ్ని గుండంలో నడకలో భాగంగా మండుతున్న అగ్ని కీలలపై పడి 7 ఏళ్ల బాలుడికి కాలిన గాయాలయ్యాయి. ఆలయ వార్షిక ఆది ఉత్సవాల్లో భాగంగా కట్టుకొల్లైమేడు గ్రామంలోని మరియమ్మన్ ఆలయంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని 100 మందికి పైగా భక్తులు మండుతున్న బొగ్గుల గుంటపై నడుచుకుంటూ పండుగను తిలకించారు.

అందరూ ఒకరి తర్వాత ఒకరు గొయ్యిని దాటారు, కానీ 7 ఏళ్ల మోనిష్ వంతు రావడంతో, అతను ముందుకు వెళ్లడానికి వెనుకాడాడు. మరికొందరు ఆయనను ఒప్పించి ఫైర్ వాక్ ను కొనసాగించారు. సంఘటన వీడియోలో, ఒక పోలీసు అధికారి గొయ్యి దాటడానికి అతనిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు. బాలుడు ఇంకా సంకోచంగా కనిపించడంతో, అతని వెనుక ఉన్న వ్యక్తి అతని చేయి పట్టుకుని అతనితో పాటు గొయ్యిలోకి వెళ్లాడు.

అయితే బాలుడు వణికిపోతూ నిప్పుల కుంపటిపై పడ్డాడు. ఆ వ్యక్తి అతన్ని త్వరగా బయటకు తీసినప్పటికీ, అతనికి కాలిన గాయాలు తగిలాయి. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story