బైక్‌లో పెట్రోల్‌ ఖాళీ..అయ్యో రైడర్‌కు ఎంత కష్టమొచ్చింది..!

హైదరాబాద్‌లో ఓ బైక్‌ ట్యాక్సీ రైడర్‌కు వింత అనుభవం ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  12 Feb 2024 5:01 PM IST
bike taxi, rider,  tough customer, hyderabad,

 బైక్‌లో పెట్రోల్‌ ఖాళీ..అయ్యో రైడర్‌కు ఎంత కష్టమొచ్చింది..!

నగరాల్లో గమ్యస్థానాలకు వెళ్లేవారు చాలా మంది సొంత వాహనాలను ఉపయోగిస్తారు. ఇంకొందరు ఆర్టీసీ బస్సులు.. మెట్రో రైలు ఇదీ కాదంటే ఆటోలను వాడుతారు. కొద్దికాలంగా ఒక్కరు మాత్రమే జర్నీ చేసేందుకు పలు యాప్‌లు వచ్చాయి. బైక్‌ ట్యాక్సీలు కూడా రావడంతో వాటిని వాడేవారు పెరిగారు. బస్సులు, ఆటోల్లో వెళ్తే టైమ్‌ వేస్ట్‌ అవుతుంది అనుకునే వారు వీటిని ఉపయోగిస్తుంటారు. బైక్‌లు ఉన్న వారు చాలా మంది ఆయా యాప్స్‌లో రిజిస్టర్‌ చేసుకుని బైక్‌ రైడర్స్‌గా పనిచేస్తున్నారు. అయితే.. అలాంటి ఒక బైక్‌ రైడర్‌కే వింత అనుభవం ఎదురైంది.

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి బైక్‌ రైడర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే రోడ్డుపైకి వచ్చి వచ్చిన రైడ్స్‌ను తీసుకుంటూ కస్టమర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాడు. బహుషా అతను చూసుకోలేదు కావొచ్చు.. ఒక రైడ్‌ జరుగుతుండగానే బండిలో పెట్రోల్ అయిపోయింది. దాంతో.. రైడ్‌ పూర్తి కాకుండా పెట్రోల్ అయిపోవడంతో బంక్‌ వరకూ తనతో నడవాలంటూ కస్టమర్‌ను సదురు రైడర్ కోరాడు. దానికి ఆ వ్యక్తి తిరస్కరించాడు. చేసేందేం లేక బైక్‌ రైడర్‌ తన కస్టమర్‌ను బైక్‌పై కూర్చొబెట్టుకుని బైక్‌ తోసుకుంటూ పెట్రోల్‌ బంక్‌ వరకు వెళ్లాల్సి వచ్చింది. అయితే.. దీనికి సంబంధించిన దృశ్యాలను రోడ్డుపై వెళ్తున్న కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సదురు కస్టమర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌పై సానుభూతి చూపలేదని మండిపడుతున్నారు. కాస్త మానవత్వంతో ఉండాలని హితవు పలుకుతున్నారు. ఇంత మూర్ఖంగా ఉండటం సరికాదంటున్నారు.


Next Story