Tej Pratap Yadav: కలలో శ్రీకృష్ణుడు కనిపించడంతో ఉలిక్కిపడి లేచిన మంత్రి

హిందూ దేవుళ్ల వేషధారణపై మక్కువ ఉన్న ఆర్జేడీ నేత, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ట్విట్టర్‌లో ఒక వీడియోను

By అంజి  Published on  23 March 2023 1:17 PM GMT
Bihar minister Tej Pratap, Krishna Vishwaroop dream

Tej Pratap Yadav: కలలో శ్రీకృష్ణుడు కనిపించడంతో ఉలిక్కిపడి లేచిన మంత్రి

హిందూ దేవుళ్ల వేషధారణపై మక్కువ ఉన్న ఆర్జేడీ నేత, బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ట్విట్టర్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. కలలో శ్రీకృష్ణుడిని చూశానని చెప్పారు. చక్రం, అలంకరించబడిన కిరీటంతో ఆ భ‌గ‌వానుడు ధ‌గ‌ధ‌గా మెరిసిపోతున్నాడ‌ని, గధా ఆయుధంతో ఉన్న ఆ దేవుడు దేదీప్య‌మానంగా వెలిగిపోతున్నాడ‌ని తేజ్‌ ప్రతాప్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నాడు. తేజ్ ప్రతాప్ అప్పుడ‌ప్పుడూ హిందూ దేవత‌ల వేషాధారణలు వేస్తుంటాడు. తనక వచ్చిన కలల గురించి చెబుతూ అందర్నీ థ్రిల్‌ చేస్తుంటాడు.

వీడియోలో.. లాలూ ప్ర‌సాద్ కొడుకైన తేజ్ ప్రతాప్ నిద్రపోతున్నట్లు కనిపిస్తాడు. అతను మహాభారత యుద్ధం, శ్రీకృష్ణుడు గురించి కలలు కంటాడు. తన కలలో దేవుడిని చూసిన తేజ్ ప్రతాప్ షాక్‌తో మేల్కొంటాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్జేడీ నాయకుడు తేజ్‌ ప్రతాప్‌ తన విభిన్న చేష్టలతో అందర్నీ ఆకట్టుకోవడం ఇదే ఫస్ట్‌టైమ్‌ కాదు. అంతకుముందు ఫిబ్రవరి 22 న అతను పాట్నాలోని సచివాలయానికి సైకిల్ వెళ్లాడు. దివంగత సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్‌ను "తన కలలో చూసిన" తర్వాత నుండి ప్రేరణ పొంది సైకిల్‌పై వెళ్లానని చెప్పాడు.

తేజ్ ప్రతాప్ శ్రీకృష్ణుని వేషధారణలో, తనను తాను హిందూ దేవుడితో పోల్చుకోవడంలో ప్రసిద్ధి చెందాడు. అతను తన సోదరుడు తేజస్వి యాదవ్‌ను 'అర్జున్' అని, తనను 'కృష్ణ' అని పేర్కొన్నాడు. పాట్నాలోని ఒక శివాలయంలో ప్రార్థనలు చేయడానికి అతను శివుడిలా వేషధారణ కూడా చేశాడు.

Next Story