విగ్‌తో రెండోపెళ్లికి రెడీ..నిజం తెలిసి ఉతికారేసిన బంధువులు

బీహార్‌లో ఓ వ్యక్తి విగ్‌ పెట్టుకుని రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. నిజం తెలియడంతో బంధువులు ఉతికారేశారు.

By Srikanth Gundamalla  Published on  11 July 2023 11:34 AM IST
Bihar, 2nd Marriage, Wig, Groom ,

విగ్‌తో రెండోపెళ్లికి రెడీ..నిజం తెలిసి ఉతికారేసిన బంధువులు

బీహార్‌లో ఓ వ్యక్తి రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. అది కూడా మొదటి భార్య బతికి ఉండగానే.. ఆమెకు విడాకులు కూడా ఇవ్వకుండా మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులకు నిజం తెలిసింది. మోసం చేసి రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకుని అతిని చితకబాదారు. అంతేకాదు.. కాసేపటికే మరో ట్విస్ట్‌ జరిగింది. అతను విగ్‌ ధరించాడని.. అది లేకపోతే ఏజ్‌ దాటిన వ్యక్తిలా కనిపించాడు. దాంతో.. యువతి కుటుంబ సభ్యులు మరింత కోపానికి గురై ఉతికి ఆరేశారు.

బీహార్‌లోని గయాలో జరిగింది ఈ ఘటన. ఇంకాసేపట్లో పెళ్లి అనగా వరుడికి అల్‌రెడీ పెళ్లి జరిగిందన్న విషయం తెలిసింది వధువు కుటుంబ సభ్యులకు. ఇదేంటని వరుడిని నిలదీసి అడగ్గా అవునని బొంకాడు. దాంతో.. మోసం చేస్తావా అంటూ వధువు కుటుంబ సభ్యులు వరుడిని చితకబాదారు. అంతేకాదు.. కాసేపటికే అతడినికి బయటకు తీసుకెళ్లి నలుగురిలో కూర్చోబెడతారు. కొందరు వ్యక్తులు వరుడిని కొట్టేందుకు జుట్టు పట్టుకునే ప్రయత్నం చేశారు. దానికి వరుడు ఎవరూ తన జుట్టుని పట్టుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. మళ్లీ అలా చేయకుండా సదురు వ్యక్తికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు అమ్మాయి తరఫు బంధువులు. దాంతో వరుడికి గుండు కొట్టించాలని అనుకున్నారు. అప్పుడే బయటపడింది మరో నిజం. గుండు చేయించుకోవడానికి వరుడు వెనకాడాడు. తీరా ఏంటా గమనిస్తే.. అతనికి బట్టతల ఉంది. దాంతో.. వధువు కుటుంబ సభ్యులు మరింత ఆగ్రహానికి గురై.. మరోసారి ఉతికి ఆరేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

బీహార్‌లో గతంలోనూ ఇలాంటి పెళ్లి జరిగింది. 13 ఏళ్ల బాలికకు 60 ఏళ్ల వృద్ధుడితో వివాహం జరిపించారు. బాలిక పెళ్లికి నిరాకరించినా.. ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఆ పెళ్లి జరిపించారు. పెళ్లయ్యాక బాలికను పెళ్లికొడుకు ఇష్టమా అని అడిగితే దానికి..ఆమె దీనికంటే చావంటేనే ఇష్టమని చెప్పింది. బాల్య వివాహాలు నేరమైనా ఇలా తల్లిదండ్రులే బలవంతంగా పెళ్లి చేయడంతో ఈ వార్త కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Next Story