నిన్న అనారోగ్యంతో ఆసుపత్రిలో.. నేడు ఎక్స్‌లో రోజాపై సెటైర్లు
ఆస్పత్రి బెడ్‌పై బండ్ల గణేశ్ చికిత్స పొందుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Jun 2024 4:38 PM ISTఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బండ్ల గణేశ్ (వైరల్ వీడియో)
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దాంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై బండ్ల గణేశ్ పడుకుని చికిత్స పొందుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయనకు ఏం జరిగిందంటూ పలువురు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు.
కాగా.. బండ్ల గణేశ్ ఛాతిలో నొప్పితో బాధపడ్డారని.. అందుకే ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రిలో చేరిన తర్వాత ఆయన్ని పరిశీలించిన వైద్యులు.. చికిత్స అందించారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.
నిర్మాతగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలను నిర్మించి పెద్ద విజయాలను అందుకున్నాడు బండ్ల గణేశ్. అయితే.. కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కానీ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రాజకీయాలకు సంబందించిన విషయాలను పంచుకుంటున్నారు. తన అభిప్రాయాలను చెబుతున్నారు. ఎన్నికల సమయంలో బండ్ల గణేశ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
మరోవైపు నిన్న ఆస్పత్రి పాలైన బండ్ల గణేశ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. తాజాగా ఏపీలో వెలువడుతున్న ఫలితాలపై స్పందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ మంత్రులు పలువురు ఓటమిని చూశారు. వారిని ట్రోల్ చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారు.
ఏమి కిక్ వస్తుంది రా నయన pic.twitter.com/LATpYu9VdY
— Swathi Reddy (@Swathireddytdp) June 4, 2024
బండ్ల గణేష్ కు అస్వస్థత... అపోలో ఆస్పత్రిలో చికిత్స #BandlaGanesh pic.twitter.com/lP5Kn2q0vs
— NewsWala (@NewsWalaTelugu) June 3, 2024