ఆరుగురు కూర్చొనే బండి.. ఆనంద్ మ‌హీంద్రా ఫిదా..!

Anand Mahindra Shares Video Of An Innovative Multi-Rider Passenger Vehicle.ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Dec 2022 10:55 AM IST
ఆరుగురు కూర్చొనే బండి.. ఆనంద్ మ‌హీంద్రా ఫిదా..!

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మ‌హీంద్ర సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయ‌న ఏదైనా షేర్ చేశారంటే అది ఖ‌చ్చితంగా ఆస‌క్తిక‌రంగానో, ఆలోచింప‌చేసేదిగానో ఉంటుంది. తాజాగా ఆయ‌న మ‌రో కొత్త సృజ‌నాత్మ‌క‌త‌ను నెటీజ‌న్ల‌కు ప‌రిచ‌యం చేశారు. ఓ బ్యాట‌రీ వాహ‌నానికి సంబంధించిన వీడియో అది. ఈ వాహ‌నం చూడ‌డానికి బైక్‌లాగా క‌నిపిస్తున్నా, ఆరుగురు కూర్చునేలాగా వేరువేరు సీట్ల‌తో చాలా పొడ‌వుగా ఉంది.

ఈ వీడియోను ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేస్తూ ఐరోపాలోని ర‌ద్దీగా ఉండే ప‌ర్యాట‌క కేంద్రాల్లో క‌నిపించే టూర్ బ‌స్సులా కేవలం చిన్న‌పాటి మార్పుల‌తో ఈ వాహ‌నాన్నీ అంత‌ర్జాతీయంగా వినియోగించ‌వ‌చ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ర‌వాణారంగ ఆవిష్క‌ర‌ణ‌లు నన్ను ఎప్పుడూ ఆక‌ట్టుకుంటాయ‌న్నారు. "ఇక్క‌డ అవ‌స‌రాలే ఆవిష్క‌ర‌ణ‌ల‌కు మూలం" అని ఆ వీడియోకు క్యాప్ష‌న్ పెట్టారు.

ఇక ఈ వాహ‌నాన్ని త‌యారు చేసేందుకు రూ.12వేల‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని, ఒక్క‌సారి దీన్ని చార్జ్ చేస్తే 150 కిలోమీట‌ర్లు ఈజీగా ప్ర‌యాణించ‌వచ్చున‌ని ఆ వీడియోలో ఓ యువ‌కుడు చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

డిసెంబర్ 1న షేర్ చేసిన ఈ వీడియో 4 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ వినూత్న ప్యాసింజర్ వాహనాన్ని నెటిజన్లు అందరూ ప్రశంసిస్తున్నారు.ఆ యువ‌కుడి ప్ర‌తిభ‌ను ప్ర‌శంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. జూ పార్కులు, ఆఫీస్ ప్రాంగ‌ణాల్లో ఇటువంటి వాహ‌నాలు చాలా ఉప‌యుక్తంగా ఉంటాయ‌ని అంటున్నారు. కొంతమంది వినియోగదారులు దాని పనితీరును మరింత సమర్థవంతంగా చేయడానికి భాగస్వామ్యం చేయడానికి కొన్ని స‌ల‌హా, సూచ‌న‌లు ఇస్తున్నారు.

Next Story