Viral Video: దొంగలను ఒంటిచేత్తో ఎదుర్కొన్న మహిళ

ఓ ఇంట్లోకి చొరబడేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు.

By Srikanth Gundamalla  Published on  2 Oct 2024 3:15 PM IST
Viral Video: దొంగలను ఒంటిచేత్తో ఎదుర్కొన్న మహిళ

ఓ ఇంట్లోకి చొరబడేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. ఇంట్లో మనుషులు ఉన్నా.. దొంగతనానికి ట్రై చేశారు. కానీ.. వారి ప్లాన్‌ను ఒంటి చేత్తో ఆపేసింది ఒక మహిళ. ముసుగు దొంగలను పారిపోయేలా చేసింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధైర్యసాహసాలు చూపించిన ఆ మహిళను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అక్టోబర్‌ ఒకటి నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అమృత్‌సర్‌లోని ఓ ఇంట్లో ఇది జరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే.. అమృత్‌సర్‌లోని ఓ ఇంట్లో మహిళ బట్టలు ఉతికిన తర్వాత వాటిని టెర్రస్‌పై ఆరబెట్టేందుకు వెళ్లింది. ఆమె అక్కడ ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు తన ఇంటి వైపు రావడాన్ని గమనించింది. ముసుగు వేసుకున్న వ్యక్తులు ఆమె ఇంటి ప్రహారి గోడను దూకారు. అంతే.. వెంటనే కిందకు పరుగు తీసింది. మెయిన్‌ డోర్‌ వద్దకు వెళ్లింది. కానీ.. అప్పటికే దుండగులు అక్కడి దాకా వచ్చేశారు. ఇంట్లోకి బలవంతంగా వచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె డోర్‌ను మూసివేసింది. గడియ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే.. అవతలివైపు నుంచి దుండగులు ముందుకు తోస్తున్నారు. ఆమె ఏ మాత్రం పట్టువిడవలేదు. ఒంటి చేత్తోనే వారిని ఎదుర్కొంది. పెద్దగా అరుస్తూనే.. ధైర్యంగా దొంగలను ఎదుర్కొంది. ఇక కాసేపటికే పక్కనే ఉన్న సోఫాను డోర్‌ వరకు లాగి.. అడ్డుగా పెట్టింది. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. కాగా.. సదురు మహిళ దొంగలను ఒంటిచేత్తో ఎదుర్కొన్న దృశ్యాలు ఇంట్లో ఉన్న కెమెరాలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Next Story