కుప్పకూలిన 285 అడుగుల భారీ కటౌట్‌..ప్రాణాలు కాపాడుకునేందుకు అజిత్ ఫ్యాన్స్ పరుగులు

తమిళనాడులోని తిరునల్వేలిలోని ఒక థియేటర్ వద్ద అజిత్ కుమార్ ఫొటోతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కూలిపోయింది.

By Knakam Karthik
Published on : 7 April 2025 9:08 AM IST

Cinema News, Tamil Actor Ajith Kumar, 285 Feets Cut Out Collapses

కుప్పకూలిన 285 అడుగుల భారీ కటౌట్‌..ప్రాణాలు కాపాడుకునేందుకు అజిత్ ఫ్యాన్స్ పరుగులు

తమిళనాడులోని తిరునల్వేలిలోని ఒక థియేటర్ వద్ద అజిత్ కుమార్ ఫొటోతో ఏర్పాటు చేసిన భారీ కటౌట్ కూలిపోయింది. ఇటీవలే విదాముయార్చి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే తిరునల్వేలిలోని PSS మల్టీప్లెక్స్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలకు సన్నాహాలు చేయడానికి అజిత్ ఫ్యాన్స్ థియేటర్‌కు వచ్చారు. పిఎస్‌ఎస్ సినిమా హాలులో అజిత్ 285 అడుగుల ఎత్తైన భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఇనుప రాడ్లతో నిర్మించిన ఈ కటౌట్ ఆకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో అభిమానులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై అజిత్ కుమార్ కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. కాగా ఏప్రిల్ 4న విడుదలైన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.

Next Story