ఆమ్లెట్‌లో బొద్దింక, ఎయిరిండియా ప్రయాణికురాలికి చేదు అనుభవం

ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది.

By Srikanth Gundamalla  Published on  29 Sept 2024 4:03 PM IST
ఆమ్లెట్‌లో బొద్దింక, ఎయిరిండియా ప్రయాణికురాలికి చేదు అనుభవం

ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికురాలికి చేదు అనుభవం ఎదురైంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో మహిళ ప్రయాణం చేసింది. ప్రయాణ సమయంలో ఆమె ఆమ్లెట్‌ తీసుకురావాని ఎయిరిండియా సిబ్బందిని కోరింది. ఇక వారు కూడా ఆమె ఆర్డర్ మేరకు ఆమ్లెట్‌ను తీసుకొచ్చి అందించారు. ఆమ్లెట్‌ తింటున్న క్రమంలో ప్రయాణికురాలికి షాక్‌ ఎదురైంది. ఆమె తింటున్న ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించింది. ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సెప్టెంబర్ 17 ఢిల్లీ నుంచి న్యూయార్క్‌కు వెళ్తున్న AI 101 విమానంలో తాను ప్రయాణించానని పేర్కొంది. ఫ్లైట్‌లో ఆహారాన్ని ఆర్డర్ చేస్తే.. ఆమ్లెట్‌లో బొద్దింక తీసుకొచ్చారంటూ అసహనం వ్యక్తం చేసింది.

అయితే.. దీని గురించి ఎయిరిండియా ఫ్లైట్‌ సిబ్బందికి ఫిర్యాదు కూడా చేసినట్లు బాధితురాలు పేర్కొంది. విమానంలో అందించిన ఆహార పదార్థాల వీడియోలు, చిత్రాలను ఎక్స్‌లో షేర్ చేయడంతో.. అవి వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చూసుకోవాలి కదా అంటూ సూచిస్తున్నారు. ప్రయాణికుల ఆరోగ్యం గురించి ఆలోచించాలనీ.. ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని అంటున్నారు. ఆమ్లెట్‌లో బొద్దింక కనిపించిన ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సదురు విమాన సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.


Next Story