ఆగ్రాలో దారుణం.. టూరిస్టుని చితక్కొట్టిన యువకులు (వీడియో)

ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అక్కడి స్థానికులు కర్రలు, రాడ్లతో చావబాదారు.

By Srikanth Gundamalla  Published on  18 July 2023 10:23 AM GMT
Agra, Attack,  Taj Mahal Tourist, viral

ఆగ్రాలో దారుణం.. టూరిస్టుని చితక్కొట్టిన యువకులు (వీడియో)

ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని అక్కడి స్థానికులు కర్రలు, రాడ్లతో చావబాదారు. అయితే.. టూరిస్టు రోడ్డుపై కారులో వెళ్తుండగా ఒక వ్యక్తికి కారు తగిలింది. దాంతో అక్కడే ఉన్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదురు టూరిస్టు చూసుకోలేదు.. క్షమించండి అంటోన్న వినిపించుకోలేదు. అక్కడే చితకొట్టారు. దాంతో ఆ టూరిస్టు అక్కడి నుంచి పరిగెత్తి స్వీట్‌షాపులోకి వెళ్లాడు. వదలకుండా కొందరు యువకులు కర్రలు, రాడ్లు తీసుకొచ్చి చావ బాదారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తాజ్‌మహల్‌ చూసేందుకు ఆగ్రాకు బయల్దేరాడు. తీరా ఆగ్రాకు చేరుకున్నాక.. రోడ్డుపక్కనే కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. వారి దగ్గరగా వెళ్లిన టూరిస్టు పొరపాటున ఒకరిని గుద్దేశాడు. దాంతో.. మిగతా వ్యక్తులు దుర్భాషలాడుతూ టూరిస్టుని బయటకు లాగారు. అతను క్షమాపణ చెప్తున్నా పట్టించుకోలేదు. అక్కడే చితకొట్టారు. దాంతో భయపడిపోయిన టూరిస్టు పరుగుతీశాడు. దగ్గరలో ఉన్న ఓ స్వీటు షాపులోకి వెళ్లాడు. అయినా టూరిస్టుని యువకులు వదల్లేదు. తమ వెంట కర్రలు, ఇనుపరాడ్లు తెచ్చుకుని మరీ దాడి చేశారు. కొన్ని నిమిషాల పాటు కొడుతూనే ఉన్నారు. వదిలేయండని అతను ఎంత ప్రాధేయపడుతున్నా వినిపించుకోలేదు. చావ బాదిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా స్వీటు షాపులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

నెటిజన్లు సదురు వ్యక్తుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ప్రమాదానికి అంతలా చావబాదాలా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చు తీసుకుని.. పోలీసులకు అప్పజెప్తే అయిపోయేది కదా అంటున్నారు. అయితే.. యువకుల దాడిలో ఢిల్లీకి చెందిన టూరిస్ట్‌కు గాయాలు అయ్యాయి. స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక వీడియో కూడా వైరల్‌ కావడంతో పోలీసులు ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే నిందితులను పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆగ్రా పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Next Story