మద్యం సీసాలో బొద్దింక.. మందుబాబులకు షాక్‌

A cockroach in a liquor bottle of a wine shop in Tamil Nadu.. Video goes viral. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని

By అంజి  Published on  18 Jan 2023 12:36 PM IST
మద్యం సీసాలో బొద్దింక.. మందుబాబులకు షాక్‌

తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముత్తంపాళయం గ్రామంలో నూతనంగా నిర్మించిన టాస్మాక్ మద్యం దుకాణం నడుస్తోంది. ఈ టాస్మాక్ మద్యం షాపులో ఈరోజు పొంగల్ తిరునాల సందర్భంగా గ్రామంలోని కొందరు యువకులు మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లారు. ఆ తర్వాత వారు కొనుగోలు చేసిన బాటిల్‌ సీల్ కనిపించలేదు. పైగా ఆ బాటిల్‌లో బొద్దింక కనిపించింది. దీంతో మద్యం దుకాణదారుని చుట్టుముట్టి యువకులు వాగ్వాదానికి దిగారు.

దుకాణదారుడు సరైన వివరణ ఇవ్వకుండా.. మద్యం సీసాలను విక్రయించడం మొదలుపెట్టాడు. దీంతో యువకులు కోపోద్రిక్తులయ్యి.. మద్యం సీసాలో బొద్దింకను వీడియో తీసి నెట్టింట పోస్ట్‌ చేశారు. మద్యం సీసాలో బొద్దింక ఉందంటూ మద్యం కొనుగోలు చేసిన యువకులు విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు మద్యం సీసా లోపల పురుగులు ఉన్నాయని, ఈ మద్యాన్ని కొనుగోలు చేసి సేవించే మద్యం ప్రియులు నానా తంటాలు పడుతున్నారని, దీంతో ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, దీనిపై తమిళనాడు ప్రభుత్వం వెంటనే ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం సీసాలో ఓ పురుగు చనిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సృష్టిస్తోంది.

ఇదిలా ఉంటే.. డిసెంబర్ 2021లో కోయంబత్తూరులోని ఆర్‌ఎస్ పురంలోని ఎలైట్ మద్యం దుకాణంలో ఒక వ్యక్తి అధిక నాణ్యత గల మద్యాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం బయటకు వెళ్లి వైన్ బాటిల్‌ను తెరవకముందే అందులో విషపు పురుగు ఉన్నట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు. దీంతో ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన కలకలం రేపింది. నాణ్యమైన వైన్‌లో ఈ రకమైన విష కీటకాలు ఉండటంతో వైన్ ప్రియులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దుఃఖాన్ని మరచి సంతోషంగా ఉండేందుకు మద్యం కొంటాం. అయితే మద్యం బాటిళ్లలో ఇలా పురుగులు ఉండడం మరింత బాధ కలిగిస్తోందని ప్రజలు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story