ఓ మహిళ మీద విచక్షణారహితంగా దాడి చేసి.. దోచుకుని వెళ్లిన సీసీటీవీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రో లిఫ్టులో ఈ ఘటన చోటు చేసుకుందంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. చాలామంది ఢిల్లీ మెట్రో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ను ట్యాగ్ చేస్తూ ఉన్నారు.

“@OfficialDMRC #delhimetro @CISFHQrs @delhipolice @LtGovDelhi This video is or lift bat some Metro station in Delhi. A man enters the lift and loots a girl”(sic) అంటూ పోస్టు కూడా పెట్టారు. ఈ ఘటనపై నిజం తెలియజేయాలంటూ ఢిల్లీ పోలీసులను, ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ మెట్రో విభాగాన్ని కూడా కోరారు.

నిజ నిర్ధారణ:

ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.

న్యూస్ మీటర్ ఈ వీడియోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా THE STRAITS TIMES లో ఫిబ్రవరి 2019న కథనాన్ని ప్రచురించారు. సీసీటీవీలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేశారు. మలేషియా లోని కౌలాలంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ చేరాస్ లోని మాస్ రాపిడ్ ట్రాన్సిట్(ఎం.ఆర్.టి.) స్టేషన్ లిఫ్ట్ లో ఫిబ్రవరి 14, 2019న ఈ ఘటన చోటు చేసుకుంది. కౌలాలంపూర్ సిటీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ చీఫ్ 'రుస్ది మొహమ్మద్ ఇసా' మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఆ మహిళకు గాయాలయ్యాయని.. ట్రీట్మెంట్ ఇస్తున్నారని అప్పట్లో తెలిపారు.

ఉదయం 6:45 సమయంలో ఓ మహిళ మలేషియా లోని కౌలాలంపూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ చేరాస్ లోని మాస్ రాపిడ్ ట్రాన్సిట్ స్టేషన్ లిఫ్టులోకి ఒంటరిగా వచ్చిందని.. ఆమెను అనుసరిస్తూ మరో వ్యక్తి కూడా వచ్చాడు. ఆమెను దోచుకునే యత్నంలో ఆమె మీద పిడిగుద్దులతో దాడి చేశాడు.. 56 సెకెండ్ల పాటూ ఈ ఘటన చోటుచేసుకుంది అని అక్కడి మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయని.. ఈ దారుణం సీసీటీవీల్లో రికార్డు అయ్యాయని తెలిపారు పోలీసులు.

వైరల్ అవుతున్న వీడియోలపై ఢిల్లీ మెట్రో కూడా క్లారిటీ ఇచ్చింది. ఢిల్లీ మెట్రోలో ఈ ఘటన చోటుచేసుకోలేదని వివరిస్తూ.. ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటన ఏదీ ఢిల్లీ మెట్రో స్టేషన్ పరిధిలో చోటు చేసుకోలేదని.. ప్రయాణీకుల రక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకుంటూ ఉన్నామని వెల్లడించారు మెట్రో అధికారులు. “The CCTV footage of a girl being attacked inside a lift is not from the Delhi Metro. No such incident has ever been reported here. Delhi Metro premises are always secured by adequate security arrangements by trained personnel” అంటూ ట్వీట్ చేయడం జరిగింది.వైరల్ అవుతున్న పోస్టులు 'పచ్చి అబద్ధం'. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకోలేదు.. మలేషియాలోని కౌలాలంపూర్ లో 2019 సంవత్సరంలో చోటుచేసుకుంది.

Claim Review :   Fact Check : ఢిల్లీ మెట్రో లిఫ్టులో మహిళ మీద విచక్షణా రహితంగా దాడి చేశారా..?
Claimed By :  Unknown
Fact Check :  false

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story