తాగిన మైకంలో ఎస్సైని ఢీకొట్టిన మందుబాబులు
By Newsmeter.Network Published on 2 Jan 2020 10:55 AM IST
వికారాబాద్ జిల్లాలో నలుగురు యువకులు మద్యం సేవించి హల్‌చల్ చేశారు. అనంతగిరిలో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్సైని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై శ్రీకృష్ణకు తీవ్రగాయాలతో పాటు, కాలు విరిగిపోయింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసు సిబ్బందిని ఎస్సైని హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు టీలిచౌకికి చెందిన హనువర్, నవీద్, సమీర్, ఇమ్రాన్‌గా పోలీసులు గుర్తించారు.
నిందితులు డ్రగ్స్ తీసుకోని వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. నవబాపేట ఎస్సై తన సిబ్బందితో అనంతగిరి కొండల వద్ద విధులు నిర్వహిస్తుండగా ఈ దారుణం జరిగింది. ఓవర్ స్పీడ్‌గా వస్తుండడంతో కారును ఎస్సై ఆపాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు.. ఎస్సైపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. నిందితులను వెంబడించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.