విజయవాడలో రెచ్చిపోయిన మహిళ.. బస్సు డ్రైవర్​పై దాడి

Woman Beats RTC Driver in Vijayawada. ఏపీలోని విజయవాడలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. బస్సుతో తన స్కూటీని

By అంజి
Published on : 31 July 2022 1:44 PM IST

విజయవాడలో రెచ్చిపోయిన మహిళ.. బస్సు డ్రైవర్​పై దాడి

ఏపీలోని విజయవాడలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. బస్సుతో తన స్కూటీని ఢీకొట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవేశంతో బస్సును ఆపింది. బస్సు లోపలికి వెళ్లి డ్రైవర్‌ను ఎడాపెడా బాదింది. ఎంత చెబుతున్నా వినకుండా.. డ్రైవర్ గల్లా పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించింది. కోపంతో డ్రైవర్‌ ముఖంపై పిడిగుద్దులు గుద్దింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కొద్దిపాట్లో తన ప్రాణం పోయేదని చెప్పింది. తన బండినే ఢీ కొడతావా అంటూ అసభ్యపద జాలంతో దూషించింది.

అయితే ఈ ఘటనలో మహిళకు ఎలాంటి గాయాలు కాలేదు. సదరు మహిళే రాంగ్‌ రూట్‌లో వచ్చిందని బస్సు డ్రైవర్ ఆరోపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. విజయవాడలోని కంట్రోల్ రూమ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు పెరుగుతున్నాయి. పోయిన నెలలో విజయవాడ​లో ఓ ఇద్దరు యువకులు బస్సు డ్రైవర్​పై దాడి మరువకముందే.. తాజా ఘటన చోటు చేసుకుంది.

ఆ మొన్న హైదరాబాద్​లో ఆటోను పక్కకు తీయమన్నందుకు ఆ డ్రైవర్​ విచక్షణ కోల్పోయి.. బస్సు డ్రైవర్​పై దాడి చేశాడు.


Next Story