టీడీపీ ఎమ్మెల్సీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ప‌రిస్థితి విష‌మం

TDP MLC Bachula Arjunudu hospitalised.ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈ రోజు తెల్ల‌వారుజామున తీవ్ర అస్వ‌స్థ‌త‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Jan 2023 9:27 AM IST
టీడీపీ ఎమ్మెల్సీకి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ప‌రిస్థితి విష‌మం

తెలుగు దేశం పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈ రోజు(ఆదివారం) తెల్ల‌వారుజామున తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యారు. గుండె నొప్పి రావ‌డంతో వెంట‌నే ఆయ‌న్ను కుటుంబ స‌భ్యులు విజ‌య‌వాడ‌లోని ర‌మేశ్ ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. అక్క‌డి వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న‌కు స్టంట్ వేశారు. బీపీ ఎక్కువ‌గా ఉండ‌డంతో ఆయ‌న ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు.

బచ్చుల అర్జునుడు అస్వ‌స్థ‌త‌లో ఆస్ప‌త్రిలో చేరారు అన్న విష‌యం తెలుసుకున్న వెంట‌నే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బచ్చుల ఆరోగ్యంపై ఆరా తీశారు. విష‌యం తెలిసిన టీడీపీ నాయ‌కులు ర‌మేశ్ ఆస్ప‌త్రికి చేరుకుంటున్నారు.

బచ్చుల అర్జునుడు స్వ‌స్థ‌లం మచిలీపట్నం. 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. గ‌తంలో ఆయ‌న మ‌చిలీపట్నం మునిసిపాలిటీ ఛైర్మన్ గానూ పని చేశారు.

Next Story