జగన్‌కు జనం కంటే ధనమే ముఖ్యం.. వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ మండిపాటు
TDP leader Nara Lokesh Fires on YSRCP Government.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై
By తోట వంశీ కుమార్ Published on
7 Dec 2021 6:44 AM GMT

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ఇసుకాసురుల అక్రమాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితుల కన్నీళ్లు ఆరకముందే గ్రామాల్లో ఇసుక ట్రాక్టర్లు క్యూ కట్టాయంటే.. సీఎం జగన్ కు జనం కంటే ధనమే ముఖ్యమని అర్థం అవుతోందంటూ చురకలు అంటించారు. వైసీపీ నాయకుల ధనదాహానికి 39 మంది జల సమాధి అయ్యారని.. 12 గ్రామాలు నీట మునిగాయన్నారు. రూ.1721 కోట్ల నష్టం వాటిల్లిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
బాధితులకు కనీస న్యాయం జరగకముందే కడప జిల్లా నందలూరు మండలం, ఆడవూరు క్వారీలో ఇసుక విక్రయాలు ప్రారంభించారని మండిపడ్డారు. జల ప్రళయానికి కారణమైన ఇసుక మాఫియాని కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే వారికి అండ నిలవడం బాధాకరమని తెలిపారు.
Next Story