విజయవాడ నగరం నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్విరాన్‌మెంటల్ ఇంటరాక్టివ్ బిల్ బోర్డ్‌ను తాజ్ మహల్ టీ ఏర్పాటు చేసింది. ఈ ఘనతను సాధించిన బ్రూక్ బాండ్ తాజ్ మహల్ టీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఈ బిల్ బోర్డును ఏర్పాటు చేశారు. మేఘ్ సంతూర్ పేరుతో 2250 చదరపు అడుగుల బిల్ బోర్డ్‌ని ప్రదర్శించారు. దీనిని ప్రత్యేకంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంతో రూపొందించారు. ఇది స్థానికులకు, బాటసారులకు అపూర్వమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది సాంకేతికత, ప్రకృతి, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం యొక్క మనోహరమైన ట్యూన్‌లను సజావుగా మిళితం చేస్తుంది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, భారతదేశం, ఏపీఏసీ అధికారిక న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగారికర్ తాజ్ మహల్ టీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేషన్ అందించారు. బిల్‌బోర్డ్ & సర్టిఫికేషన్‌ను ఆవిష్కరించడంపై వ్యాఖ్యానిస్తూ, హిందుస్థాన్ యూనిలీవర్, బెవరేజెస్ అండ్ ఫుడ్స్ హెడ్ శివ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ''గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఇంటరాక్టివ్ బిల్‌బోర్డ్‌గా 'మేఘ్ సంతూర్' గుర్తింపు పొందినందుకు మేము సంతోషిస్తున్నాము. తాజ్ మహల్ టీకి విజయవాడ అతిపెద్ద కోటలలో ఒకటి" అని అన్నారు. 50 మంది నిపుణుల బృందంతో 6 నెలల పాటు శ్రమించి ఈ బిల్ బోర్డ్‌ని ఏర్పాటు చేశారు.