దేశ భాషలందూ తెలుగు లెస్స : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Draupadi murmu speech in Poranki.తెలుగు బాషను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2022 1:21 PM ISTతెలుగు బాషను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. తెలుగు సాహిత్యం దేశ ప్రజలందరికీ సుపరిచితమని, దేశ బాషలందు తెలుసు లెస్స అని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతికి పోరంకిలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు రాష్ట్రపతిని సత్కరించారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ తిరుమల బాలాజీ పవిత్ర స్థలానికి రావడం సౌభాగ్యంగా బావిస్తున్నానని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్న చెప్పారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని, తన కోరికను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహనీయుల గొప్పతనాన్ని రాష్ట్రపతి కీర్తించారు. భారత అభివృద్ధిలో ఏపీది కీలక పాత్ర అని అన్నారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి వంటి నదులు ఈ రాష్ట్ర నేలలను సారవంతం చేశాయన్నారు. దేశ బాషలందు తెలుసు లెస్స అని రాష్ట్రపతి అనగానే అతిథుల నుంచి పెద్ద ఎత్తున కరతాళ ధన్వులు వినిపించాయి
రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శం : సీఎం జగన్
ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణం అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కష్టాలను కూడా చిరునవ్వుతో ఎదుర్కొన్న ముర్ము జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అని కొనియాడారు. తమ గ్రామంలో డిగ్రీ వరకు చదువుకున్న తొలి మహిళగా ముర్ము నిలిచారని, జూనియర్ అసిస్టెంట్‌గా జీవితాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. సామాజిక వేత్తగా, ప్రజాస్వామ్య వాదిగా అణగారిన వర్గాల ప్రజల కోసం ఆమె కృషి చేశారన్నారు. రాష్ట్రపతి పదవిలో తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ముర్మును గౌరవించుకోవడం మనందరి బాధ్యతగా బావించి పౌర సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ చెప్పారు.