న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే.. ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం : సీజేఐ ఎన్వీ రమణ

CJI Justice NV Ramana speech at Vijayawada court complex event.న్యాయ వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం కోల్పోతే ప్ర‌జాస్వామ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Aug 2022 12:25 PM IST
న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే.. ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం : సీజేఐ ఎన్వీ రమణ

న్యాయ వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం కోల్పోతే ప్ర‌జాస్వామ్య మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌మ‌ని భార‌త సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. శ‌నివారం విజ‌య‌వాడ‌లో నూత‌న కోర్టు భ‌వ‌నాల స‌ముదాయాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో క‌లిసి సీజేఐ ప్రారంభించారు. అనంత‌రం సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడుతూ.. ప‌దేళ్ల క్రితం నూత‌న కోర్టు భ‌వనాల‌కు తానే శంకుస్థాపన చేశాన‌ని, ఇప్పుడు మ‌ళ్లీ తానే ప్రారంభించించ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తెలుగులో మాట్లాడటం ఆనందంగా ఉంది. కోర్టు భ‌వ‌న నిర్మాణాలు పూర్తి కావ‌డం చాలా సంతోషించ‌ద‌గ్గ విష‌యమ‌న్నారు. ప్రజలందరికి సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చామన్నారు. సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. సీనియర్‌ న్యాయవాదులు జూనియర్లను ప్రోత్సహిస్తే బాగుంటుందన్నారు. సమాజం శాంతియుతంగా, ఐకమత్యంతో ఉంటే అభివృద్ధి చాలా సులువుగా జరుగుతుందని తెలిపారు.

కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఈ నేపథ్యంలో కోర్టు భవనాల నిర్మాణానికి నిధుల కోసం కేంద్రాన్ని కోరామన్నారు. కేంద్ర నిధులు ఇస్తే సహకరించినట్లవుతుందని తెలిపారు. న్యాయ‌స్థానాల్లో పెండింగ్ కేసుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై విశ్వాసం కోల్పోతే ప్ర‌జాస్వామ్య మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదని చెప్పారు. న్యాయ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ట ప‌రిచే కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామ్యం త‌ప్ప‌నిస‌రి అన్నారు. తన ఉన్నతికి, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Next Story