ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. దీంతో డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను రాజేంద్రనాథ్ రెడ్డి చేపట్టనున్నారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. అలాగే హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వర్తించారు. పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా పనిచేశారు. ఇక తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని సవాంగ్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
గౌతమ్ సవాంగ్ పై బదిలీకి అదే కారణమా..?
ఇటీవల ఉద్యోగులు పీఆర్‌సీ పై అసహనంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ వేసినట్లు తెలుస్తోంది.