తన రాజకీయ భవిష్యత్‌పై సోము వీర్రాజు సంచలన ప్రకటన
AP BJP Chief Somu Veerraju Comments on Political Future.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన
By తోట వంశీ కుమార్ Published on 7 Dec 2021 1:09 PM ISTఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన రాజకీయ భవిష్యత్‌పై సంచలన ప్రకటన చేశారు. 2024 తరువాత తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తాను పదవులు ఆశించి పనిచేయడం లేదని.. తనకు సీఎం అవ్వాలన్న కోరిక లేదని తెలిపారు.2014 ఎన్నికల సమయంలో తనకు రాజమండ్రి సీటుతో పాటు మంత్రి పదవి ఆఫర్ చేశారని.. అయినప్పటికి తాను వ్దదని చెప్పినట్లు తెలిపారు. తాను బీజేపీ కార్యకర్తను అని పార్టీ కోసం కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఎదిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు కోరారు.
50 గ్రాముల కోడిగుడ్లు పిల్లలకిస్తే పాదాభివందనం చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెత్తి మీద చేతులు పెట్టి ముద్దులు పెట్టే బదులు కొడిగుడ్లు ఇవ్వొచ్చుగా..? అని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో మధ్యాహ్నా భోజన పథకం సరిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ఏపీలో సమగ్రమైన నీటి ప్రాజెక్టుల కోసం ప్రణాళిక బధ్ధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెలుతోందన్నారు. పోలవరం నిర్మాణానికి ఇప్పటికే కేంద్రప్రభుత్వం రూ.11వేల కోట్లు ఇచ్చిందన్నారు. మీరు కట్టండి.. మేము డబ్బులు ఇస్తాం.. లేదంటే పోలవరం మాకివ్వండి మేము కట్టిస్తామని చెప్పారు. తన సొంత జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ తెరిపించుకోలేని జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
డిసెంబర్ పదమూడున 'దివ్య కాశీ.. భవ్య కాశీ' పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కాశీ క్షేత్రం రూపురేఖలు పూర్తిగా మార్చారని తెలిపారు. కాశీ క్షేత్రం అబివృద్ది కార్యక్రమాలని ప్రధాని మోదీ ప్రారంభించే సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని అన్ని మండలాలలో స్క్రీన్ ల ద్వారా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.