రంగారెడ్డి: అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో చెరుకూరి విజయారెడ్డి దహన సంస్కారాలు పూర్తయ్యాయి.

నాగోల్‌ శ్మశాన వాటికలో విజయారెడ్డి భౌతికకాయానికి భర్త సుభాష్‌రెడ్డి అంత్య క్రియలు నిర్వహించారు.

విజాయారెడ్డి అంతిమయాత్రలో రెవెన్యూశాఖ ఉద్యోగులు, ప్రజలు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని.. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

Mro1

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో కార్యాలయంలో విజయారెడ్డిని రైతు సురేష్‌ పెట్రోల్‌ పోసి తగలబెట్టిన విషయం తెలిసిందే.

తుర్కయంజాల్‌ గ్రామంలో ఉన్న ఓ భూమికి సంబంధించిన పాస్‌బుక్‌ను ఇవ్వాలని చాలా రోజులగా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సురేష్‌ను ఎమ్మార్వో విజయారెడ్డి పట్టించుకోకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు చెప్తున్నారు.

ఎమ్మార్వోతో వాగ్వాదం జరిగిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

Mro2

ఆ మంటలు సురేష్‌కు కూడా అంటుకోవడంతో నిందితుడికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.

విజయారెడ్డిని కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలు కాగా వారికి డీఆర్‌డీఎల్‌ ఆపోలో ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురునాథ్‌ ఇవాళ కన్నుమూశాడు. తహశీల్దార్‌ విజయారెడ్డి మృతిలో ఆమె ఇంటి వద్ద విషాదఛాయలు నెలకొన్నాయి.

Mro3

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

One comment on "తహశీల్దార్‌ విజయారెడ్డి అంత్యక్రియలు పూర్తి"

Comments are closed.